రాచకొండ ఎత్తిపోతల పథకమే శరణ్యం
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:53 AM
ఎలాంటి సాగునీటి వనరులు లేని ఈ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రైతు సంఘం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, విశ్రాంత ఇంజనీర్ల ఫోరం నాయకుడు ఇంద్రసేనారెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ.జహంగీర్ కోరారు.
రాచకొండ ఎత్తిపోతల పథకమే శరణ్యం
రైతు సంఘం పూర్వ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి
సంస్థాన నారాయణపురం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి సాగునీటి వనరులు లేని ఈ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రైతు సంఘం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, విశ్రాంత ఇంజనీర్ల ఫోరం నాయకుడు ఇంద్రసేనారెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ.జహంగీర్ కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాననారాయణపురం మండల కేం ద్రంలో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో రాచకొండ ఎత్తిపోతల పథకంపై సదస్సు నిర్వహించారు. అంతకుముందు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సదస్సులో మల్లారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి సాగునీటి సౌకర్యం లేక సకాలంలో వర్షాలు లేక ఈ ప్రాంతమంతా కరువు కోరల్లో చిక్కుకుందని తెలిపారు. ఒక సంవత్సరం వర్షం పడితే నాలుగు సంవత్సరాలు కరువు బారిన పడి రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పేరుతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా శివన్నగూడెం చెరువులను నింపి అక్కడి నుంచి లిఫ్టులద్వారా మండలానికి సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయ తలపెట్టిన రాచకొండ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ప్రభుత్వం ఆమోదించలేదని అన్నారు. ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. శివన్న గూడెం రిజర్వాయర్ పూర్తికానిదే నారాయణపురం మండలంలోని గిరిజన తండాలకు ఇతర గ్రామాలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, మిట్ట ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాలకు లిఫ్ట్ ద్వారానే సాగునీరు అందించడం సాధ్యమవుతుందని తెలి పారు. ఈ ప్రాంతంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చదువుకున్న నిరుద్యోగులు సైతం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాచకొండలో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతం లో సాగు తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టి లో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వలసలు ఆగాలంటే సాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజ్, సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, గుంటో జు శ్రీనివాస్‌చారి, దోడ యాదిరెడ్డి, దోనూరు నర్సిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, దొంతగాని పెద్దలు, మల్లెపల్లి లలిత, చింతకాయల నరసింహ, పిట్టరాములు, ఐతరాజు గాలయ్య పాల్గొన్నారు