Share News

kumaram bheem asifabad-న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 09:59 PM

న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని ఆసిఫాబాద్‌ బార్‌ సోసియేషన్‌ అధ్యక్షుడు రాపర్తి రవి డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని చేపడుతున్న నిరాహర దీక్షకు పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో పాటు హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ సిటీ క్రిమినల్‌ కోర్టులోని న్యాయవాదుల బోగ అనిల్‌, హనుమాన్‌నాయక్‌లపై కక్షిదారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆసిఫాబాద్‌ న్యాయవాధులు విధులు బహిష్కరించారు.

kumaram bheem asifabad-న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలి
మాట్లాడుతున్న బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాపర్తి రవి

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెబరు 19 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని ఆసిఫాబాద్‌ బార్‌ సోసియేషన్‌ అధ్యక్షుడు రాపర్తి రవి డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని చేపడుతున్న నిరాహర దీక్షకు పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో పాటు హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ సిటీ క్రిమినల్‌ కోర్టులోని న్యాయవాదుల బోగ అనిల్‌, హనుమాన్‌నాయక్‌లపై కక్షిదారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆసిఫాబాద్‌ న్యాయవాధులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ తెలంగాణ స్టేట్‌ పిలుపు మేరకు విధులు బహిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు చరణ్‌, సతీష్‌బాబు, ఎం.సురేష్‌, డి.సురేష్‌, రవీందర్‌, కిశోర్‌, గణపతి, రామకృష్ణ, రౌనక్‌ అగర్వాల్‌, చంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 09:59 PM