కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:34 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హా మీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాలలోని సీ పీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 3 (ఆంధ్ర జ్యోతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హా మీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాలలోని సీ పీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై వి శ్వాసంతో ప్రజలు గెలిపించారని, కానీ అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వా సాన్ని కోల్పోతోందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాల ని డిమాండ్ చేశారు. సదరం సర్టిఫికెట్ల గడు వు ముగిసిన వారు పెన్షన్‌లు రాక ఇబ్బందు లు పడుతున్నారని వెంటనే సదరం సర్టిఫికెట్ ల గడువు పొడగించాలన్నారు. ఈ సమావేశం లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కలీందర్ అలీఖాన్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, మిట్టపల్లి వెంకటస్వామి, పూర్ణిమ, రేగుంట చంద్రశేఖర్, చిప్పనర్సయ్య పాల్గొన్నారు.