Share News

kumaram bheem asifabad- కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలి

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:20 PM

వివాహం చేసుకున్న ఆడ పడుచులకు తులం బంగా రం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో బుధవారం జైనూర్‌ , సిర్పూర్‌(యు), లింగాపూ ర్‌ మండలాల పరిధిలో 164 మంది లబ్ధిదారులకు మంజూనైన కల్యాణలక్ష్మి, షాదీముబా రక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

kumaram bheem asifabad-  కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలి
చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

జైనూర్‌, జూన్‌25 (ఆంధ్రజ్యోతి): వివాహం చేసుకున్న ఆడ పడుచులకు తులం బంగా రం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో బుధవారం జైనూర్‌ , సిర్పూర్‌(యు), లింగాపూ ర్‌ మండలాల పరిధిలో 164 మంది లబ్ధిదారులకు మంజూనైన కల్యాణలక్ష్మి, షాదీముబా రక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపడుచులకు ముఖ్యమంత్రి ఇచ్చిన తులం బంగారం హామీ నిలబెట్టుకోవాలని కోరారు. కాగా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆసిఫాబాద్‌ నుంచి జైనూర్‌ మండల కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రధాన రోడ్డు అధ్వానంగా మారిందని, అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవర్‌గూడ నుంఇ టింకాపెల్లి వరకు ప్రధాన రోడ్డు అధ్వానంగా తయారైందని చెప్పారు. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. సంబంధిత కంట్రాక్టర్‌ ఎందుకు మిగిలిన పని పూర్తి చేయడం లేదని ఆర్‌ అండ్‌బి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో రోడ్డు పని పూర్తి కావడం లేదని అధికారులు చెప్పారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనకు గురువారం వస్తున్న మంత్రుల దృష్టికి జైనూర్‌ ప్రధాన రోడ్డు సమస్య వివరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల తహసీల్దార్లు ఆడ బీర్షావ్‌, రాథోడ్‌ ప్రహ్లద్‌, నాగరాజు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్‌లాల, మాజీ స్పంచులు మడావి భీంరావ్‌, మేస్రాం నాగోరావ్‌, మేస్రాం రాహుల్‌, కుంర శాంరావ్‌, మాజీ ఎంపీటీసీలు కుంర భగ్వంత్‌రావ్‌, జుగాదిరావ్‌, నాయకులు ఆత్రం శంకర్‌, నాయకులు ధమ్మపాల్‌, మాజీ ఉప సర్పంచ్‌ సావిత్రిబాయి తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని 27 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణల క్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ పెంటు, తహసీల్దార్‌ కవిత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 11:20 PM