Share News

పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:30 PM

పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యలను పరిష్కరించాలని కోరు తూ గురువారం సీపీఐ నాయకులు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో హరిక్రిష్ణకు వినతి పత్రం అందజేశారు.

పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలి
ఆర్డీవోకు వినతి పత్రం అంద జేస్తున్న సీపీఐ నాయకులు

బెల్లంపల్లి, ఏప్రిల్‌10(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యలను పరిష్కరించాలని కోరు తూ గురువారం సీపీఐ నాయకులు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో హరిక్రిష్ణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ పట్టణంలో సింగరేణి శిథిలావస్థల ఉన్న క్వార్టర్లలో నివసిస్తు న్న వారికి జీవో నంబర్‌ 76 ప్రకారం గత ప్రభుత్వ హయాంలో ఇండ్ల పట్టాలిచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఇండ్ల పట్టాల ప్రక్రియ నిలిచిపోయిందని ఎంతో మంది పట్టాల కోసం బ్యాంకుల్లో రుసుం చెల్లిం చాలని ఇప్పటి వరకు పట్టాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే ఇండ్ల పట్టాల మంజూరుకు స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులందరికి రేషన్‌కార్డులు అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. మరికొందరికి రేషన్‌కార్డులు లేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటిలో డంపింగ్‌యార్డు లేకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారుతుందని ఎక్కడ చూసిన చెత్తచెదారం దర్శనమిస్తున్నాయన్నారు. డంపింగ్‌యార్డు కోసం వెంటనే స్థలం కేటాయించాలని పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు, సీనియర్‌ నా యకులు చిప్ప నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:30 PM