Share News

హమాలీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

ABN , Publish Date - Aug 15 , 2025 | 11:50 PM

హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అగర్వాల్‌ భవన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ హమాలీ సంఘం మహా సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీలు ఎదుర్కొం టున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తీసుకుంటానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హమాలీలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా పాలన సాగిస్తుందన్నారు.

హమాలీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్‌

బెల్లంపల్లి,ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అగర్వాల్‌ భవన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ హమాలీ సంఘం మహా సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీలు ఎదుర్కొం టున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తీసుకుంటానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హమాలీలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా పాలన సాగిస్తుందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం హమాలీలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు హమాలీలు పాత బస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు హమాలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా హమాలీ సంఘం జిల్లా ఽఅధ్యక్షులు గెల్లి రాజలింగుతో పాటు పలువురు నాయకులు, హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 11:50 PM