Share News

ఎరుకల కులస్తుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 07 , 2025 | 10:28 PM

ఎరుకల కులస్తుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవా రం తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో నస్పూర్‌లోని కలె క్టరేట్‌ ఎదుట ఒక రోజు దీక్ష చేపట్టారు. అనంతరం పలు డిమాం డ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆదనపు కలెక్టర్‌ చంద్రయ్యకు వినతి పత్రం అందించారు.

ఎరుకల కులస్తుల సమస్యలను పరిష్కరించాలి
కలెక్టరేట్‌ ఎదుట దీక్షలో కూర్చున్న ఎరుకల ప్రజా సమితి నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట దీక్ష

నస్పూర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఎరుకల కులస్తుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవా రం తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో నస్పూర్‌లోని కలె క్టరేట్‌ ఎదుట ఒక రోజు దీక్ష చేపట్టారు. అనంతరం పలు డిమాం డ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆదనపు కలెక్టర్‌ చంద్రయ్యకు వినతి పత్రం అందించారు. అనంతరం ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్య క్షుడు కెమసారం తిరుపతి మాట్లాడుతూ సమాజంలో ఎరుకల కు లస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నరని, వారిని ప్రభుత్వం ఆదు కోవాలన్నారు. పందుల పెంపకం కోసం ప్రతి కుటుంబానికి ఐదెక రాల భూమిని ఇవ్వాలన్నారు. కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. శాస్త్రీయ పద్ధతిలో పందుల పెంపకం కోసం ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం నిర్వహించా లన్నారు. ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జె ట్‌ను కేటాయించాలన్నారు. మున్సిపాలిటీల్లో పంది మాంసం విక్ర యానికి దుకాణాలు ఏర్పాటు చేయించాలన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న యువతకు నూరు శాతం సబ్సిడితో ఆటోలను ఇప్పించాలన్నా రు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్‌టీ బ్యాక్‌ లాగ్‌ పోస్టులను వెం టనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఉ మ్మడి జిల్లా అధ్యక్షుడు రెవెల్లి ఓదెలు, జిల్లా అఽధ్యక్షుడు ఉండ్రాల ఎ ల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాధుల మహేష్‌, జిల్లా వ ర్కిం గ్‌ ప్రసిడెంట్‌ ఉండ్రాల రవి, ఉపాధ్యక్షుడు అశోక్‌, నాయకులు సం తోష్‌, సభాష్‌, రవి కుమార్‌, మహిళ సమితి రాష్ట్ర అఽధ్యక్షురాలు పు ష్ప, మహిళా నాయకులు విజయ, రజిత, రాజవ్వ, సత్తవ్వ, కోమల, పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 10:29 PM