కాలనీల్లో సమస్యల తిష్ఠ
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:48 AM
జి ల్లా కేంద్రంలోని 19వ వార్డులో సమస్యలు తిష్ట వేశాయి.

కాలనీల్లో సమస్యల తిష్ఠ
ప్రమాదకరంగా మారిన విద్యుత ట్రాన్సఫార్మర్లు
సీబీఎఫ్ నిధులు తిరిగి మంజూరయ్యేనా?
శ్రీనగర్, ఎన్జీవోస్, ఆదిత్య కాలనీల్లో తాగునీటి సమస్య
ఇదీ 19వ వార్డు పరిస్థితి
నల్లగొండ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జి ల్లా కేంద్రంలోని 19వ వార్డులో సమస్యలు తిష్ట వేశాయి. కాలనీల్లో సమస్యల పరిష్కారానికి అఽధికారులే పూర్తిస్థాయి బాధ్యత వహించాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుస్తుంది. పట్టణ పరిధిలోని పానగల్ రోడ్డులో ఉన్న నందీశ్వర్ కాలనీ, శ్రీనగర్ కాలనీల్లో విద్యుత ట్రాన్సఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. రో డ్డుపైనే ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమా దం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత ట్రాన్సఫార్మర్లను షిఫ్టింగ్ చేయాలని పలుమార్లు విద్యుతశాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఈ విద్యుత ట్రాన్సఫార్మర్లు 3, 19 వార్డుల మధ్యలో ఉండటంతో ప్రజల రాకపోకలు ఇబ్బందులుగా మారాయి. 3, 19 వార్డులలోని శ్రీనగర్ కాలనీలోని పైభాగంతో పాటు ఆదిత్య కాలనీ, ఎన్జీవోస్ కాలనీలో కొంత భాగంలో త్రీఫేజ్ వైర్ లేకపోవడంతో పాటు లోవోల్టేజీ సమస్యలు అధికంగా ఉంటున్నా యి. అదేవిధంగా శిథిలమైన స్తంభాలను మార్చాలని, అవసరమైన చోట ఇంటర్మీడియట్ పోల్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే కొట్టుమిట్టాడుతున్నాయి.
సీబీఎఫ్ నిధులు మంజూరు చేయాలి...
గతంలో 19వ వార్డులో అభివృద్ధి పనుల కోసం రూ.10లక్షల సీబీఎఫ్ నిధులు మంజూరయ్యాయి. అయితే వా టిని కొన్ని నెలల క్రి తం రద్దు చేయడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. శ్రీనగర్ కాలనీ, ఆదిత్య కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, దీపక్‌నగర్ కాలనీ, సంజయ్‌గాంధీ కాలనీ, అ మూల్య కాలనీల్లో గుంతలు పూడ్చడానికి ఈ నిధులను వెచ్చించాల్సి ఉంది. సీబీఎఫ్ నిధులు రద్దు కావడంతో తిరిగి ఆ నిధులను మంజూరు చేయాలని కోరుతూ ఆయా కాలనీవాసులు కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా కాలనీల్లో రోడ్లు గుంతలమయవడంతో వర్షం వస్తే రోడ్లు బురదమయమై రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా శ్రీనగర్ కాలనీతో పాటు ఎన్జీవోస్ కాలనీ, ఆదిత్య కాలనీల్లో మంచినీటి సమస్య తీవ్రంగా మారింది. కొత్త పైపులైన్లు వేయాల్సి ఉ న్నా రెండేళ్లుగా ఏర్పాటు చేయకపోవడంతో తాగునీటి సమస్య పరిష్కారం లభించడం లేదు. సమస్యను పరిష్కరించాలని కోరినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసిన ప్రాంతంలో సిమెంట్ రోడ్లను కట్ చేయడం వల్ల ప్రజలకు, వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంటనే కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి
జిల్లా కేంద్రంలోని 19వ వార్డులోని స మస్యలను వెంటనే పరిష్కరించాలి. వా ర్డులోని ప్రధాన రోడ్లన్నింటినీ సీసీ రో డ్లుగా మార్చాలి. వార్డులో 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. వార్డులో ఐమా స్ట్ లైట్లు, ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చే యాలని రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేసినా మునిసిపాలిటీ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు. అండర్ గ్రౌం డ్ డ్రైనేజీ సమయంలో తవ్విన సిమెంట్ రోడ్లకు మరమ్మతులు చే యకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలనీల్లో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం వ స్తేనే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. గతంలో కేటా యించిన రూ.10లక్షల సీబీఎఫ్ నిధులు మంజూరు చేయాలి.
- కొండూరు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్