Share News

kumaram bheem asifabad- కొండెక్కిన కోడిగుడ్డు ధర

ABN , Publish Date - Nov 23 , 2025 | 10:29 PM

కోడిగుడ్డు ధర కొండెక్కిది. రోజురోజుకూ ధర పెరిగిపోతుండడంతో నేటి రోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యానికి బలం చేకూర్చే ఆహార పదార్థాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు రావడానికి గాను మాంసకృత్తులతో పాటు కోడిగుడ్లను వినియోగిస్తున్నారు. ఆర్థికంగా స్థోమత కలిగిన కుటుంబాల వారు వారం రోజులకు ఒకసారి మాంసహారం తీసుకుంటారు. ఇక సామాన్య కుటుంబాల వారు కోడిగుడ్లను వినియోగిస్తారు. అటువంటి సామాన్యుడికి అందుబాటులో ఉన్న కోడిగుడ్ల ధరలు అందకుండా పోతున్నాయి.

kumaram bheem asifabad- కొండెక్కిన కోడిగుడ్డు ధర
లోగో

బెజ్జూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కోడిగుడ్డు ధర కొండెక్కిది. రోజురోజుకూ ధర పెరిగిపోతుండడంతో నేటి రోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యానికి బలం చేకూర్చే ఆహార పదార్థాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు రావడానికి గాను మాంసకృత్తులతో పాటు కోడిగుడ్లను వినియోగిస్తున్నారు. ఆర్థికంగా స్థోమత కలిగిన కుటుంబాల వారు వారం రోజులకు ఒకసారి మాంసహారం తీసుకుంటారు. ఇక సామాన్య కుటుంబాల వారు కోడిగుడ్లను వినియోగిస్తారు. అటువంటి సామాన్యుడికి అందుబాటులో ఉన్న కోడిగుడ్ల ధరలు అందకుండా పోతున్నాయి. గత కొద్ది రోజుల కిందట వరకు రిటైల్‌ మార్కెట్‌లో రూ.6ఉన్న ధర నేడు రూ.8కి చేరడంతో సామాన్యులకు భారంగా మారింది. కార్తీక మాసంలో హోల్‌సేల్‌ ధరలు 30గుడ్ల ఽట్రే ధర రూ.180ఉండగా, కార్తీక మాసం పూర్తయిన తర్వాత 30గుడ్ల ట్రే ధర రూ.200నుంచి రూ.201కి అమ్ముతున్నారు. దీంతో రిటైల్‌ కిరాణా వ్యాపారులు ఒక గుడ్డు ధర రూ.8కి అమ్ముతున్నారు. హైదరాబాద్‌ మార్కెట్‌లో కోడిగుడ్ల ధర రూ.630ఉండగా, హోల్‌సేల్‌ వ్యాపారుల కమీషన్‌, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలతో కలిపి రూ.700లకు అమ్ముతున్నారు. దీంతో గత కొద్ది రోజుల కిందటి వరకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న కోడిగుడ్లు నేడు కొండెక్కి కూర్చుండటంతో తినడానికి వెనుకాడుతున్నారు. రానున్న రోజుల్లో కోడిగుడ్ల ధరలు మరింత పెరిగే అవకాఽశం ఉందని పౌల్ర్టీ వ్యాపారులు చెప్పడంతో ధరలు ఇప్పట్లో దిగివచ్చే అవకాశం లేదని వ్యాపారులు చర్చించుకుంటున్నారు.

ఉత్పత్తి తగ్గడం వల్లే..

గుడ్ల ఉత్పత్తి తగ్గడం వల్లే దర పెరుగుతుందని ఫామ్‌రైతులు, హోల్‌సేల్‌ దుకాణా దారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి ప్రభావం పెరిగింది. సామాన్యంగా చలికాలంలో గుడ్లను అందించే కోళ్లు చలి ప్రభావంతో గుడ్లు పెట్టడం తగ్గిస్తాయని దీంతో ఉత్పత్తి తగ్గడంతో గుడ్లకు డిమాండ్‌ ఏర్పడి ధరల పెరుగుదలకు కారణమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇక చలి తీవ్రతకు ప్రజలు విరివిగా గుడ్లను వినియోగించడంతో కొరత ఏర్పడి గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. చలి తీవ్రత ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక గుడ్ల ధరలు రోజురోజుకూ పెరుగుతండటంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు భారంగా మారి తమకు గిట్టుబాటు కాదని వంట నిర్వాహకులు వాపోతున్నారు. ఒక్కో పాఠశాలలో వందల మంది విద్యార్థులు ఉంటే తాము ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ వారు వాపోతున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 10:29 PM