Share News

kumaram bheem asifabad-ఉప సర్పంచ్‌ పదవి ఉత్తదేమీ కాదు

ABN , Publish Date - Dec 05 , 2025 | 10:45 PM

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవితో పాటు ఉప సర్పంచ్‌ స్థానం కూడా హాట్‌ కేక్‌ అవుతోంది. ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతునిస్తున్న పార్టీలు ఒక సర్పంచ్‌ స్థానాన్ని మాత్రమే గెలుచుకోవడం వల్ల ప్రయోజనం లేదని, ఉప సర్పంచ్‌ స్థానాన్ని కూడా దక్కించుకుంటే గెలుపునకు పరిపూర్ణత సిద్దిస్తుందని భావిస్తున్నారు.

kumaram bheem asifabad-ఉప సర్పంచ్‌ పదవి ఉత్తదేమీ కాదు
లోగో

- ఇప్పటి నుంచే మంతనాలు

- రిజర్వేషన్‌ కలిసిరాని చోట మారుతున్న వ్యూహాలు

కౌటాల/వాంకిడి/బెజ్జూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవితో పాటు ఉప సర్పంచ్‌ స్థానం కూడా హాట్‌ కేక్‌ అవుతోంది. ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతునిస్తున్న పార్టీలు ఒక సర్పంచ్‌ స్థానాన్ని మాత్రమే గెలుచుకోవడం వల్ల ప్రయోజనం లేదని, ఉప సర్పంచ్‌ స్థానాన్ని కూడా దక్కించుకుంటే గెలుపునకు పరిపూర్ణత సిద్దిస్తుందని భావిస్తున్నారు. ఇందు కోసం ఉప సర్పంచ్‌ స్థానాలపై కూడా ప్రధానంగా గురి పెడుతున్నాయి. దీనిని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌ను కూడా కైవసం చేసుకోక పోతే పార్టీలు రాజకీయంగా ప్రతికూలతను ఎదుర్కొవాల్సి ఉంటుంది. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌ కూడా అధికారాలు ఉండడమే ఈ పదవికి అంత క్రేజ్‌. ముఖ్యంగా ఉప సర్పంచకు చెక్‌ పవర్‌ ఉండడం ఈ పదవి డిమాండ్‌ను పెంచింది. ఉప సర్పంచను ఎన్నుకునేది వార్డు సభ్యులే అయి నందు వల్ల ఈ వార్డు సభ్యుల పదవులకు పోటీ తీవ్రంగా ఉంది. రాజకీయంగా పార్టీల నుంచి గట్టి మద్దతు ఉన్న వారు వార్డు పదవుల్లో సైతం గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

- అనుకూలంగా రాని చోట్ల..

ఉన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలంగా రాని చోట్ల నాయకులు వ్యూహం మార్చుకుం టున్నారు. సర్పంచి కాక పోయినా చెక పవర్‌ ఉన్న ఉప సర్పంచ్‌ పదవిని దక్కించుకొ ని ఊరిని ఏలుదామని పథకాలు రచించుకుంటున్నారు. ఆయా రిజర్వేషన్లకు చెందిన వెంట ఉండేవారు. చెప్పిన మాట వినే అనుచరుడు, లేదంటే అతడి సతీమణి సర్పంచ్‌గా బడిలోకి దింపి గెలిపించుకునేందుకు ఏరాపట్లు చేసుకుంటున్నారు. మొదటి, రెండో విడత ఎన్నికల నామినేషన్లలో ఇదే జరిగింది. సర్పంచ్‌ నుంచి వార్డు సభ్యుల వరకు అనువైన వారిని ఎంపిక చేసుకునేందుకు నేతలు రాత్రింబవళ్లు సమాలోచనలు చేస్తున్నారు. ఉప సర్పంచ్‌ కావాలంటే వార్డు సభ్యులే కీలకం కానున్నారు. దీంతో చెప్పిన మాట వినేవారితోనే నామినేషన్‌ వేయిస్తున్నారు. వారికి అవసరమైన నామినేషన పత్రాలు, పనునల చెల్లింపు, దృవపత్రాలు తీసుకోవడం వంటి పనులన్నీ ఆ నాయకులే చూసుకుంటున్నారు.

- మహిళా సర్పంచ్‌లు ఉన్న చోట..

మహిళా సర్పంచ్‌లు గెలిచిన పంచాయతీల్లో ఉప సర్పంచ్‌గా గెలుపొంది ఆధిపత్యం చెలాయించవచ్చనే ఉద్దేశ్యంతో పలుకుబడి కలిగిన నేతలు వార్డు సభ్యులుగా బరిలోకి దిగుతున్నారు. 50 శాతం సర్పంచ్‌ స్థానాలు మహిళలకు కేటాయించారు. పాలక వర్గ సమావేశాలకు సర్పంచ్‌ గైర్హాజరు అయిన సందర్భాల్లో ఉప సర్పంచ్‌ అధ్యక్షతనే నిర్వహిస్తారు. విధుల వినియోగంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచకు చెక్‌ పవర్‌ ఉంటుంది. దీంతో మేజర్‌ గ్రామపంచాయతీల్లో వార్డు సభ్యుల పదవులకు రూ.లక్షల్లో వెచ్చించేందుకు అభ్యర్థులు వెనకాడని పరిస్థితి ఉంటుంది.

- వార్డు సభ్యుడిగా..

సర్పంచ్‌గా పోటీ చేయాలని భావించిన కొందరు నాయకులకు రిజర్వేషన్‌ అనుకూ లించక పోవడంతో వార్డు సభ్యుడిగా గెలుపొంది ఉప సర్పంచ్‌గా గెలుపొందాలని బావిస్తున్నారు.. వారికి రిజర్వేషన్‌ అనుకూలించిన వార్డు నుంచి పోటీకి దిగుతున్నారు. పంచాయతీలో సర్పంచ్‌కు, ఉప సర్పంచ్‌కు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉండడంతో పోటీ తీవ్రతరమైంది. ఇక సర్పంచ్‌ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఏ అభివృద్ధి పని జరిగినా చెక్‌పై ఉప సర్పంచ్‌ సంతకం కచ్చితంగా పెట్టాల్సి రావడంతో సర్పంచ్‌ అక్రమాలకు తావుండదు. సంతకం చేయక పోతే బిల్లు పాస్‌ అయ్యే అవకాశం తక్కువ. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. అభివృద్ధి చేయాలన్న ఇద్దరు కలిసి కట్టుగా ఉండాలి. సంయుక్తంగా పని చేయాలి. సర్పంచ్‌కు దాదాపు సమానమైన ప్రోటోకాల్‌ ఉంటుంది. ఇదే అదునుగా భావించిన కొందరు సర్పంచ్‌ అభ్యర్థులు గెలిచిన వెంటనే తమకే ఉప సర్పంచ పదవి వచ్చేలా చక్రమం తిప్పుతానని ఆశ చూపి వారిని ప్రలోబాలకు గురి చేయడం ద్వారా తాము గెలువడానికి పావులు కదుపుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకు కేటాయంచిన స్థానాల్లో ఈ ఎత్తుగడులు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా నిరక్షరాస్యులైన మహిళలు పోటీ చేసే పంచాయతీల్లో ఉప సర్పంచ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. కాగా సర్పంచ్‌కి చేసే ప్రచార వ్యయం కంటే వార్డు సభ్యుడి ప్రచారానికయ్యే వ్యయం తక్కువ. వార్డు సభ్యుల నుంచి ఎన్నికవుతాడు కనుక ఆర్థికప రమైన ఒత్తిడి కూడా తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు సర్పంచ్‌ అభ్యర్థి సైతం కొద్దోగోప్పో వార్డుకు పోటీ అభ్యర్థులకు కూడా డబ్బులు సర్దుబాటు చేయడం పరిపాటి.

విధులు, బాధ్యతలు..

సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు విధులు, బాధ్యతలు ఉంటాయి. ఉప సర్పంచ్‌ గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాల్గొనడం, సర్పంచ్‌కు సహాయం చేయడంతో పాటు సర్పంచ్‌ లేనప్పుడు విధులు నిర్వహిస్తారు. పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరిగేట్లు చూడడం, రోడ్లు, మురుగు కాలువలు, వంతెనలు, బావుల నిర్మాణం, నిర్వహణ వంటి ప్రజా పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షిస్తారు. గ్రామాలలో వీధి దీపాలను ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ బాధయతలను కూడా పర్యవేక్షిస్తారు. గ్రామాల్లో ప్రాథమిక విద్యను అందించేందుకు కృషి చేస్తారు. పంచాయతీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు.

ఎన్నిక ఇలా..

సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నంలోగా వెలువడనున్నాయి. ఆ వెంటనే ఉప సర్పంచ్‌ ఎన్నికలను నిర్వహిస్తారు. ఉప సర్పంచ్‌గా పోటీ చేసేవారు ముందుగా నామినేషన్లు దాఖలు చేయడం వారిని వార్డు సభ్యుల్లో ఒకరు బలపర్చడం వంటి తతంగం ముగిసిన తరువాత ఎన్నికలను నిర్వహిస్తారు. వార్డు సభ్యులు చేతులెత్తడం ద్వారా ఎంపిక నిర్వహిస్తారు. ఎవరికి అనుకూలంగా ఎక్కువ మంది వార్డు సభ్యులు చేతులెత్తితే ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. ఒక వేళ ఇద్దరికి సమాన మద్దతు ఉన్నప్పుడు టాస్‌ ద్వారా గెలుపును నిర్ణయిస్తారు.

Updated Date - Dec 05 , 2025 | 10:46 PM