Share News

kumaram bheem asifabad- అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల అవస్థలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 10:58 PM

పొరుగు సేవల ఉద్యోగులను నియామకం చేసే అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ సంస్థలు అవకతవకలకు పాల్పడుతున్నా యి. పొరుగు సేవల ఏజెన్సీలు కార్మికులు, సిబ్బంది పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బుల కోట్లా ది రూపాయల స్వాహా పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు నెలలుగా వేతనాలు రావడం లేదని చెబుతున్నారు.

kumaram bheem asifabad- అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల అవస్థలు
విధులు బహిష్కరించి బైఠాయించిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది(ఫైల్‌)

- మూడేళ్లుగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బులు జమ చేయని ఏజెన్సీలు

- విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతున్న కార్మికులు

- అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని వినతి

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పొరుగు సేవల ఉద్యోగులను నియామకం చేసే అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ సంస్థలు అవకతవకలకు పాల్పడుతున్నా యి. పొరుగు సేవల ఏజెన్సీలు కార్మికులు, సిబ్బంది పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బుల కోట్లా ది రూపాయల స్వాహా పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు నెలలుగా వేతనాలు రావడం లేదని చెబుతున్నారు. దీంతో పాటు వేతనాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా పలు ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల్లో చేతివా టం రోజు రోజుకు ఎక్కువవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో కోట్లాది రూపాయల పీఎఫ్‌, ఈఎస్‌ఐ స్కాం జరుగుతోంది. దీంతో కార్మి కులకు భద్రత కరువవుతోందని చెబుతున్నారు.

- జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో..

జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో పారిశుధ్య, పేషెం ట్‌ కేర్‌, సెక్యూరిటీ, తదితర సిబ్బంది ఔట్‌ సోర్సింగ్‌ కింద పని చేస్తున్నారు. మూడెళ్లుగా పని చేస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు అంద డం లేదు. దీంతో గత కొద్ది నెలల కిందటి నుంచి ఆందో ళనలు చేస్తున్నప్పటికీ మార్పు లేదు. నెలల తరబ డి జీతాలు చెల్లించకుండా ఏజెన్సీ నిర్వహకులు తప్పించుకొని తిరుగుతున్నారని, వీరికి శాఖల ఉన్నతాధికారుల సహకారం ఉందని ఆరోపణలు న్నాయి. దీంతో వీరి పరిస్థితి దయనీయంగా మారి పూట గడవని పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా ఏజెన్సీలే సొంతంగా జీతాలు చెల్లించాల్సి ఉంటుం దని, నిధులు వచ్చాక సరి చూసుకోవాలనే నిబంధనలున్నాయని కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తం గా కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, తిర్యాణి, బెజ్జూరు, మెడికల్‌ కాలేజీ జైభీం సొసైటీ ఏజెన్సీ కాంట్రాక్టర్‌ ఆసుపత్రి సిబ్బందికి జీతాలు ఇవ్వకపోగా, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సొమ్ము జమ చేయడం లేదనే ఆరోపణలు న్నాయి. అసలు వివరాలు కూడా ఏమీ ఇవ్వడం లేదు, 2023 నుంచి పని చేస్తున్న వారి వేతనాలకు సంబంధించి ఎలాంటి స్లిప్పులు ఇవ్వడం లేదంటు న్నారు. అధికారులు ఏజెన్పీ నిర్వాహకులకు సహక రిస్తూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

- వంద మందికి పైగా..

జిల్లా వ్యాప్తంగా సుమారు వంద మందికి పైగా పలు ఆసుపత్రుల్లో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాదిపదికన శానిటేషన్‌, సెక్యూరిటీ, పేషంట్‌ కేర్‌లుగా పని చేస్తున్నారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ ఏరియా ఆసుపత్రి, జైనూరు, తిర్యాణి, సిర్పూర్‌ (టి), బెజ్జూ రు, వాంకిడి ఆసుపత్రుల్లో పలు ఏజెన్సీల కింద వంద మందికిపైగా పని చేస్తున్నారు. వీరిలో కొంత మంది కాంట్రాక్టర్లు పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బులు జమ చేయడం లేదు. జైనూరు, సిర్పూర్‌(టి)లోని కార్మికు లకు కొంత మేర జమ చేసినా ఇంకా బకాయి లున్నాయని చెబుతున్నారు. కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి, ఆసిఫాబాద్‌, మెడికల్‌ కాలేజి, తిర్యాణి, బెజ్జూ రులో భీం సొసైటీ ఏజెన్సీ కింద పని చేసే కార్మికులకు సొసైటీ ఏజెన్సీ కాంట్రా క్టర్‌ ఈఎస్‌ఐ, పీఎఫ్‌ కోట్లల్లో బకాయిలు ఉన్నట్లు కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తు విధులు బహిష్కరిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట ధర్నా చేపడుతున్నారు.

నాలుగు నెలలుగా వేతనాలు లేవు..

సాయి, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుడు. కాగజ్‌నగర్‌ ఏరియా ఆసుపత్రి

నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు. ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సంబంఽధిత కాంట్రా క్టర్‌ జీతాలు రాలేదని అడిగితే నిర్లక్ష్యంగా సమాధా నం ఇస్తున్నారు. ఇప్పటికే చాలీచాలనీ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఇవి కూడా నెలనెలా రా కపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది.

ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి..

- బోగె ఉపేందర్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్‌ స్వాహా చేసిన వారి ఏజెన్సీలపై అధి కారులు కఠిన చర్యలు తీసుకోవాలి. కోట్లాది రూపాయల స్కాం చేసిన జైౖ భీం సొసైటీ ఏజెన్సీ కాంట్రాక్టర్‌పై విచారణ జరిపిం చాలి. ఈ విషయంలో కలెక్టర్‌కు పలు మార్లు విన్న వించినా ప్రయోజనం లేదు. అధికారులు విచా రణ చేపట్టి పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లిం చాలి. లేకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళ నలు ఉధృతం చేస్తాం.

Updated Date - Aug 10 , 2025 | 10:58 PM