రాజీ మార్గమే రాజమార్గం
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:44 PM
గ్రామాల్లో నెలకొన్న వివిధ రకాల సమస్యల పరిష్కా రానికి రాజీమార్గమే రాజ మార్గమని కొల్లాపూర్ కోర్టు ప్రిన్సిపాల్ జూని యర్ సివిల్ న్యాయాధికారి దమ్ము ఉపనిషధ్వా ని అన్నారు.
- కొల్లాపూర్ సివిల్ న్యాయాధికారి దమ్ము ఉపనిషధ్వాని
పెంట్లవెల్లి డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో నెలకొన్న వివిధ రకాల సమస్యల పరిష్కా రానికి రాజీమార్గమే రాజ మార్గమని కొల్లాపూర్ కోర్టు ప్రిన్సిపాల్ జూని యర్ సివిల్ న్యాయాధికారి దమ్ము ఉపనిషధ్వా ని అన్నారు. బుధవారం మండలంలోని కొం డూరు గ్రామంలో కొల్లాపూర్ సివిల్ కోర్టు ఆధ్వ ర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సివిల్ న్యాయా ధికారి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో చిన్నచి న్న సమస్యల పట్ల ప్రజలు ఈర్శా, ద్వేశాలు పెంచుకొని గొడవలతో కోర్టుల చుట్టూ తిరుగు తున్నారన్నారు. గ్రామపెద్దల సమక్షంలో ఇరు వర్గాలు తమ సమస్యలను పరిష్కరించు కోవ డం ఉత్తమమైన మార్గమన్నారు. అనంతరం గ్రామంలో ఇళ్లు శిథి లావస్థకు చేరి దీనస్థితిలో ఉన్న కటిక కేశవులు ఇంటికి వెళ్లి పరిశీలిం చారు. గ్రామ సర్పంచు కేతూరి ధర్మతేజ స్నేహి తులు సమకూర్చిన రూ. 70వేలను సివిల్ న్యా యాధికారి సమక్షమంలో అందజేశారు. కార్యక్ర మంలో రెండవ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధి కారి శరణ్య, న్యాయవాదులతో పాటు గ్రామ మాజీ సర్పంచు గోపాల్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.