రాజీమార్గమే రాజమార్గం
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:14 PM
రాజీ మార్గమే రాజమార్గమని, జాతీయ లోక్ అదా లత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి డి.రమాకాంత్ అన్నారు.
- జిల్లా ప్రధాన న్యాయాధికారి డి.రమాకాంత్
కందనూలు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : రాజీ మార్గమే రాజమార్గమని, జాతీయ లోక్ అదా లత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి డి.రమాకాంత్ అన్నారు. హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిం చారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి ముఖ్య అతి థిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. సివిల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ఎలక్ర్టిసిటీ కేసులు, బ్యాంకుకేసులు, పెట్టి కేసులు పరిష్కరించుకో వచ్చన్నారు. రాజీమార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకుం టే సమయాభావం, ఖర్చులు, ఆదా అవుతాయ న్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ నసీమా సుల్తానా మాట్లాడారు. ఈ లోక్ అదా లత్ ద్వారా 17,495 కేసులు పరిష్కారమయ్యా యి. కాంపౌండింగ్ ఫీజు 58,37,519 వసూలు అ య్యింది. ఈ కార్యక్రమంలో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధి కారి కుమారి ఎన్.శ్రీనిధి, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, బార్‌అసోసి యేషన్‌రవి, కాం తారావు, సీనియర్, జూని యర్ న్యాయవాదులు, పోలీ స్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
కొల్లాపూర్‌లో 931 కేసుల పరిష్కారం
కొల్లాపూర్ : కొల్లాపూర్ జూనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టుల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో కొల్లాపూ ర్, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలా లకు చెందిన 931 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు లోక్ అదాలత్ బెంచికి చైర్మన్‌గా ప్రధాన జూనియర్ సివిల్ న్యాయాధికారి దమ్ము ఉపనిషద్వాణి, సభ్యులుగా కురుమూర్తి, మోహ న్‌లాల్ వ్యవహరించారు. లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా 37కేసులు, అపరాధ రుసు ము ద్వారా 9 కేసులు, 1 ఎక్సైజ్ కేసు కంపౌం డింగ్ ఫీజు విధించి సైబర్ క్రైమ్ కేసులు 6, ద్వి తీయ శ్రేణి కోర్టుకు సంబంధించిన 878 కేసు లలో అపరాధ రుసుము విధించి పరిష్కరిం చారు. ఈ కార్యక్రమానికి ఏపీపీబీ శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల నాగరాజు, భాస్కర్‌రెడ్డి, వసంతరెడ్డి, నిరంజన్, కుర్మయ్య, శ్రీహరి, బాలస్వామి, రామలక్ష్మమ్మ, రేణుక, రాజు, సిబ్బంది భోగ హరికృష్ణ, పోలీసు సిబ్బం ది, 3 కోర్టుల సిబ్బంది హాజరయ్యారు.
మెగా లోక్ అదాలత్ విజయవంతం
కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలోని కోర్టు ఆవ రణలో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదా లత్ విజయవంతమైంది. లోక్‌అదాలత్‌లో సీని యర్ సివిల్ న్యాయాధికారి శ్రీదేవి, జూనియర్ సివిల్ న్యాయాధికారి కావ్య 819 కేసులు పరి ష్కరించారు. 723 కేసుల్లో సుమారు రూ.2,63, 490 విలువ గల కేసులు పరిష్కారమయ్యా యి. కార్యక్రమంలో కల్వకుర్తి, వెల్దండ సీఐలు, కోర్టు పరిధిలోని ఎస్‌ఐలు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఉన్నారు.