ప్రతిపక్షాల మౌనం సరికాదు
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:24 AM
రాష్ట్రంలో అఽధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేస్తుంటే ప్రశ్నించే ప్రతిపక్షాలు మౌనంగా ఉండడం సరి కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
భువనగిరి గంజ్, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అఽధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేస్తుంటే ప్రశ్నించే ప్రతిపక్షాలు మౌనంగా ఉండడం సరి కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. యాదాద్రి భు వనగిరి జిల్లాకేంద్రంలో మంగళవారం జరి గిన దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారుల మహాగర్జన సన్నాహక సదస్సులో ఆయన మా ట్లాడారు. రైతు భరోసా, రుణమాఫీ నిధులు తామే ఇచ్చామని అధికార, ప్రతిపక్షాలు ప్రచా రం చేసుకుంటున్నాయన్నారు. ప్రభుత్వం ఉన్నోడికే దోచి పెడుతోందని, లేనివోడికి మాత్రం ఏమీ లేదన్నారు. కౌలు రైతులకు, ఉపాధి కూలీలకు ఏమి ఇచ్చారని ప్రశ్నించారు. ఓట్లు సీట్ల కోసం పార్టీలు పోటాపోటీగా హామీలు ఇస్తూ నిరుపేదలకు మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితంగానే పింఛన్లు పెరిగాయన్నారు. ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు సమయానికి జీతాలు వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పింఛన్‌దారులకు ఒక నెల పెండిం గ్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. దివ్యాంగులకు రూ.6వేలు, వృద్ధులు వితంతువులు గీత, బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల పింఛన్లను రూ. 4వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే మహాగర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం ఖాసీం, జిల్లా అధ్యక్షుడు ధరణికోట నరసింహ, నాయకులు బిర్రు మహేందర్‌మాదిగ, ఇటుకల దేవేందర్, నల్ల చంద్రస్వామి, దుబ్బ రామకృష్ణ, గిద్దె రాజేష్, బట్టు రాంచంద్రయ్య, రజిత, పద్మ, శ్రీనివాస్ పాల్గొన్నారు.