పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:36 PM
ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లను అత్యధికంగా నమోదు చేసి విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచే విధంగా ఉపా ధ్యాయులు కృషి చేయాలని డీఈవో యాదయ్య సూచించారు.
డీఈవో యాదయ్య
కాసిపేట, జూలై1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లను అత్యధికంగా నమోదు చేసి విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచే విధంగా ఉపా ధ్యాయులు కృషి చేయాలని డీఈవో యాదయ్య సూచించారు. మంగళవా రం ఆయన మండలంలోని జడ్‌పీహెచ్‌ఎస్ ముత్యంపల్లి, మోడల్‌స్కూల్, కే జీబీవీ పాఠశాలలతో పాటు వరిపేట, చింతగూడెం, ఎంపీపీ పాఠశాలలో ఆ యన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చా లా తక్కువగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ముత్యంపల్లి పాఠశా ల పగుళ్లుతేలి ప్రమాదకరంగా ఉండడంతో కొత్తబిల్డింగ్ మంజూరు కోసం మాట్లాడుతానన్నారు. మోడల్‌హాస్టల్, కేఈబీవీ పాఠశాలల్లో నెలకొన్న సమ స్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోడల్ కాలేజీ హాస్టల్ నిర్వహ ణకు వస్తున్న ఆరోపణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడల్ కాలేజీ ప్రిన్సిపాల్ కేర్‌టేకర్‌పాటు, కేజీబీవీ ఎస్‌వో సమన్వయంతో పని చేయాలన్నా రు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హె చ్చరించారు. అలాగే కేజీబీవీలో కొత్త మెనూ ప్రకారం భోజనాలు అందించా లని సిబ్బందికి సూచించారు. ఈయన వెంట ఎంఈవో వెంకటేశ్వర స్వామి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఖలీల్, కేజీబీవీ ప్రత్యేకాధికారి సరిత, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.