పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - May 24 , 2025 | 10:37 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సం ఖ్య పెంచాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యం లో ఐదు రోజులుగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శి క్షణ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొ న్నారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
లక్షెట్టిపేట, మే 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సం ఖ్య పెంచాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యం లో ఐదు రోజులుగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శి క్షణ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొ న్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్య వైద్యం పై నే ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతోందన్నారు. మన ప్రాంతంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం ఉండేట్లు కృషి చేయనున్నట్లు తె లిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యార్థుల సంఖ్య పెంచేందుకు ముందుగా ఉపాధ్యాయులు పిల్లల తల్లితండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. తా ను గెలిచ నాటి నుంచిఅమ్మ ఆదర్శ పాఠశాలకు నిధులు సమకూర్చామని అంతే కాకుండా డీఎంఎఫ్‌టీ నిధులు ప్రత్యేకంగా విద్యార్థులను దృష్టిలో పె ట్టుకుని బడుల్లో మౌలిక వసతులకు నిధులు సమకూర్చామన్నారు. ఉపా ధ్యాయుల సంఖ్య కొన్ని పాఠశాలల్లో తక్కువగా ఉందని ఒక్కో టీచర్ సు మారు 16సబ్జెక్టులు చెప్పడంతో ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి కృషి చేస్తా నని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో డీఈవో యాదయ్య, ఎంఈవో శైలజ, రిసోర్స్ పర్సన్స్ పింగిళి వేణుగోపాల్, బండ శ్రీనివాస్, గిరిధర్, చంద్రశేఖర్, తిరుపతి, ఎన్,శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిర్మాణం పనుల పరిశీలన
లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న 30పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పనులతోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళా శాల భవన నిర్మాణం పనులను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. ఈసం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజికవర్గ ప్రజలకు ఒక్క పైసా ఖ ర్చు లేకుండా పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ల క్ష్యం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కావాల్సిన వసతులు, సామగ్రిని ఆ శాఖ సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఆసుపత్రి వైద్యులు సురేష్, స్రవంతి, పవిత్ర, కృష్ణ, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ ఆరీఫ్, పార్టీ మండల అద్యక్షుడు పింగిళి రమేష్, సీనియర్ నాయకులు చెల్ల నాగభూషణం, పూర్ణచందర్‌రావు, దేవేందర్‌రెడ్డి, నలిమెల రాజు, గుత్తికొండ శ్రీధర్, నవాబ్, షాహెద్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.