Share News

నామినేషన్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:27 PM

సాధారణ పంచాయతీ ఎన్ని కల నిర్వహణలో మూడవ విడత నామినేషన్‌ ప్రక్రియ సజావుగా నిర్వ హించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మం గళవారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామపంచాయతీలో నేటి నుంచి జరగనున్న నామినేషన్‌ ప్రక్రియకు చేసిన ఏర్పాట్లను పరిశీలిం చారు.

నామినేషన్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : సాధారణ పంచాయతీ ఎన్ని కల నిర్వహణలో మూడవ విడత నామినేషన్‌ ప్రక్రియ సజావుగా నిర్వ హించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మం గళవారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామపంచాయతీలో నేటి నుంచి జరగనున్న నామినేషన్‌ ప్రక్రియకు చేసిన ఏర్పాట్లను పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నామినేషన్‌ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాల న్నారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే నామినేషన్‌లను తీసుకోకూ డదని, రిజిస్టర్‌లను సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రతి అభ్యర్థి తప్పని సరిగా నూతన బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలన్నారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులో జాగ్రత్తలు వహించాలని, నామినేషన్‌ కేంద్రాల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. విధులు కేటాయించబడిన అ ధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజా వుగా నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పా టించాలన్నారు.

ఫఅనంతరం కిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొన సాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించిన కలె క్టర్‌ త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. చెన్నూరు పట్టణంలో చేపట్టిన పట్టణ ఆరోగ్య కేంద్రం, సమీకృత కూరగాయల మార్కెట్‌ నిర్మాణం, అమృత్‌ 2.0 పనులను మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. అనం తరం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో మోహన్‌ ఉన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:27 PM