Share News

నామినేషన్ల ప్రక్రియ శాంతియుతంగా జరగాలి

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:46 PM

మండలంలో రెండవ విడతలో ప్రారంభమైన నామినేషన్లలో భాగంగా గొరిట గ్రామంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం నాగర్‌క ర్నూల్‌ సీఐ అశోక్‌రెడ్డి, స్థానిక ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.

నామినేషన్ల ప్రక్రియ శాంతియుతంగా జరగాలి
నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీఐ అశోక్‌రెడ్డి

- కేంద్రాన్ని పరిశీలించిన సీఐ అశోక్‌రెడ్డి

తిమ్మాజిపేట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మండలంలో రెండవ విడతలో ప్రారంభమైన నామినేషన్లలో భాగంగా గొరిట గ్రామంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం నాగర్‌క ర్నూల్‌ సీఐ అశోక్‌రెడ్డి, స్థానిక ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. పరిస్థితులను పో లీసు సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. నామినేషన్ల ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు.

ప్రతీ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ : ఎస్‌ఐ

తాడూరు (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రం తోపాటు మండలంలోని 24 గ్రామ పంచాయ తీల పరిధిలో ఉన్న 9క్లస్టర్ల నామినేషన్‌ పరిశీ లన కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమల్లో ఉంటుం దని ఎస్‌ఐ గురుస్వామి అన్నారు. ఆదివారం మండలంలోని సిర్సవాడ నామినేషన్‌ పరిశీలన కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మా ట్లాడుతూ నామినేషన్‌ పరిశీలన కేంద్రానికి సం బంధించి వంద మీటర్ల దూరంలోనే అందరూ వేచి ఉండాలని, ఎవరూ కేంద్రంలోకి రాకూడ దని, ఎన్నికలు పూర్తయ్యే వరకు నిబంధనలను ప్రతీ ఒక్కరు పాటించాలని కోరారు.

ఎన్నికలకు సహకరించాలి : ఎస్‌ఐ

కోడేరు (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రజలందరూ సహ కరించాలని ఎస్‌ఐ జగదీశ్వర్‌ అన్నారు. ఆదివారం మండలం లో రెండవ విడత సర్పంచు ఎ న్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. మండలంలో మొ త్తం ఐదు గ్రామ పంచాయతీ కేంద్రాలలో నామినేషన్ల స్వీకర ణ జరుగుతుందని, కేటాయిం చిన గ్రామ పంచాయతీలో నామినేషన్లు వేయాలన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:46 PM