Share News

kumaram bheem asifabad- నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:18 PM

రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్‌ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల వీసీ హాల్‌ నుంచి బుధవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణలతో కలిసి జూమ్‌ మీటింగ్‌ ద్వారా మొదటి విడత మండలాలు అయిన లింగాపూర్‌, సిర్పూర్‌(యూ), జైనూరు, కెరమెరి, వాంకిడి మండలాల రిటర్నింగ్‌ అదికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, జిల్లాలోని తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఎస్సైలు, ప్లయింగ్‌ స్టాటస్టిక్‌ సర్వేయలెన్స్‌ బృందాల సభ్యులతో నామినేషన్‌ ప్రక్రియ, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు

kumaram bheem asifabad- నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, పాల్గొన్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ

ఆసిఫాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్‌ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల వీసీ హాల్‌ నుంచి బుధవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణలతో కలిసి జూమ్‌ మీటింగ్‌ ద్వారా మొదటి విడత మండలాలు అయిన లింగాపూర్‌, సిర్పూర్‌(యూ), జైనూరు, కెరమెరి, వాంకిడి మండలాల రిటర్నింగ్‌ అదికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, జిల్లాలోని తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఎస్సైలు, ప్లయింగ్‌ స్టాటస్టిక్‌ సర్వేయలెన్స్‌ బృందాల సభ్యులతో నామినేషన్‌ ప్రక్రియ, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటి విడతలో ఐదు మండలాల్లోని సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కోసం 27 కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతీ నామినేషన్‌ స్వీకరణ కేంద్రానికి రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ అధికారి ఉంటారని తెలిపారు. ఈ నెల 27 ఉదయం 10.30 గంటల ముందే ఫారం 1 నోటీసు, ఫొటో ఓటర్ల జాబితా, స్థానాల వివరాలను నామినేష్‌ స్వీకరణ కేంద్రం వద్ద ప్రదర్శించాలని తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని చెప్పారు. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు ఉండకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. నామినేషన్‌ పరిశౠలన, తుది జాబితా, గుర్తుల కేటాయింపు పూర్తి పారద్శకంగా నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసులు సమన్వయంతో ఎన్నికల ప్రవర్తన నియ మావళిని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. స్టాటిస్టిక్‌, ప్లయింగ్‌ సర్వేయలెన్స్‌ బృందాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మూడు విడతల ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో స్టేజ్‌ -1 రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 11:18 PM