నామినేషన్ ప్రక్రియ సమర్ధవంతంగా చేపట్టాలి
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:10 AM
పంచా యతీల ఎన్నికల్లో నామినేషన్‌ల ప్రక్రియ సమర్ధవం తంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలె క్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం భీమా రం, బూరుగుపల్లి, ఖాజీపల్లిలో ఏర్పాటు చేసిన నా మినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : పంచా యతీల ఎన్నికల్లో నామినేషన్‌ల ప్రక్రియ సమర్ధవం తంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలె క్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం భీమా రం, బూరుగుపల్లి, ఖాజీపల్లిలో ఏర్పాటు చేసిన నా మినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రి యలో అభ్యర్ధులు సమర్పించిన పత్రాలను ఎన్నిక ల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీ లించామన్నారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వ చ్చే నామినేషన్‌లను తీసుకోకూడదని, రిజిష్టర్‌లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ని ర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమిం చుకో వాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఎ లాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్ర క్రియను సజావుగా నిర్వహించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల వి ద్యాలయాన్ని సందర్శించి అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యను పరిశీలించి తగు సూ చనలు చేశారు. విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ వ హించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో మధుసూదన్, సీఐ నవీన్ ఉన్నారు.