kumaram bheem asifabad- ఘనంగా పొలాల అమావాస్య
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:11 PM
మండలంలో శుక్రవారం రైతులు, ప్రజలు పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామలలో గల హన్మన్ ఆలయలలో రైతులు,ప్రజలు ఉదయం నుంచే పూజలు కార్యక్రమాలు నిర్వహించారు.
సిర్పూర్(యు), ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో శుక్రవారం రైతులు, ప్రజలు పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామలలో గల హన్మన్ ఆలయలలో రైతులు,ప్రజలు ఉదయం నుంచే పూజలు కార్యక్రమాలు నిర్వహించారు.మండల కేంద్రంలో గల హన్మున్ సాయి బాబా ఆలయంలో గ్రామ పటేల్ ఆత్రం ఆనంద్‌రావు అధ్వర్యంలో ఆత్రం నీతిన్‌కుమార్,ఆత్రం ఓంప్రకాష్,ఆత్రం గంగారాం,ఆత్రం విజయ్ కుమార్‌లు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల గ్రామాల్లో పొలాల పండుగను రైతులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పశువులను అలంకరించి హనుమాన్ మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. పవర్‌గూడలో పటేల్ అనక హన్మంతు, అనక రాంజీ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో పొలాల అమావాస్య వేడకలను రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులను ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో పశువులతో ప్రదక్షిణలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండలంలోని వీర్దండి గ్రామంలో శుక్రవారం ఘనంగా పోలాల పండగను ఘనంగా జరుపుకన్నారు. పొలాల అమావాస్య రోజున రైతులు తమకు వ్యవసాయంలో చేదోగా ఉంటున్న ఎద్దులకు ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు చేసి ఆలయాలకు తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనవాయితీ. ఇందులో భాగంగా వీర్దండి గ్రామంలో పోలాల అమావాస్య పండగను నిర్వహించారు.