Share News

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:05 AM

కార్మిక సంఘాల పిలుపు మేరకు మే 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కోరారు. ఆ

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం

మోత్కూరు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కార్మిక సంఘాల పిలుపు మేరకు మే 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కోరారు. ఆదివారం మోత్కూరులో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల పని గంటలను 8 నుంచి 12 వరకు పెంచిందని, 29కి పైగా ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్తగా నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకవచ్చిందని విమర్శించారు. కార్మికుల ప్రయోజనాలు పట్టించుకోకుండా యాజమాన్యాల కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మే 20న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతంచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, మోత్కూరు మండల కన్వీనర్‌ సామ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్‌కె.శ్రీను, కొంగరి మల్లమ్మ పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 12:05 AM