Share News

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:12 AM

దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మిట్టగణుపుల ముత్యాలు పిలుపునిచ్చారు.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
నేరేడుచర్లలో సమ్మె పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

కోదాడ రూరల్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మిట్టగణుపుల ముత్యాలు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో నిర్వహించిన మార్కెట్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో నాయకులు దాసరి శ్రీనివాస్‌, ఏసోబు, తిరపయ్య, వెంకన్న, రాంబాబు, వీరభద్రం పాల్గొన్నారు.

మఠంపల్లి: గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు సయ్యద్‌ రన్‌మియా అన్నారు. మండల కేం ద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బం దులు ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూక్య సైదానాయక్‌, గురవయ్య, ప్రకాష్‌, నాగరాజు, శివ, వెంకటేశ్వర్లు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

గరిడేపల్లి: సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి షేక్‌ యాకుబ్‌, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కీసరి నాగయ్య, దోసపాటి భిక్షం, కడియాల అప్పయ్య, ప్రధాని సైదులు, రమేష్‌, కామళ్ల నవీన్‌, పోటు లక్ష్మయ్య, కుందురు వెంకటరెడ్డి, అంజయ్య, సాంబయ్య, బ్రహ్మయ్య, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

నేరేడుచర్ల: దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను నేరేడుచర్లలో టీయూసీఐ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హుస్సేన్‌, రజాక్‌, బైరం ఆనంద్‌, దేవయ్య, లక్ష్మయ్య, నాగయ్య, దేవయ్య, రంగయ్య, శాంతయ్య, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

పెన్‌పహాడ్‌: సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం డివిజన్‌ నాయకులు గుర్రం గోపాల్‌రెడ్డి, అంజిబాబుగౌడ్‌ అన్నారు. మండలంలోని చీదేళ్ళ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కరపత్రాలు అందజేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోపయ్య, వెంకటేశ్వర్లు, జయమ్మ, సోమయ్య, వెంకటమ్మ, రవి, లింగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌: కార్మికుల సంక్షేమానికి ఐక్య పోరాటాలు చేయాలని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, అరుణోదయ జిల్లా అద్యక్షులు ఉదయగిరి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను కోరారు. కార్మికుల హక్కులు కాపాడుకోవాలన్నారు. సమావేశంలో పోసనబోయిన హుస్సేన్‌, లక్ష్మయ్య, యోనా, వీరబాబు, శంకర్‌, మురళీ, అబ్రహం పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:12 AM