దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:21 AM
: దేశవ్యాప్తంగా ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు.
కట్టంగూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. కట్టంగూరులో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్‌కు అను కూలంగా వ్యహరిస్తోందన్నారు. విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్రాలపై పెత్తనాన్ని ఆపాలని కోరారు. కార్యక్రమంలో చింతపల్లి బయ్యన్న, పెంజర్ల సైదులు, నగేష్, ఆదిమల్ల సురేష్, వంటేపాక సురేష్, పొన్న అంజయ్య, వెంకటమ్మ, అరుణ, చంద్రమ్మ, లింగయ్య, జానకి తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ: ప్రధాని మోదీ రైతులు, కార్మికులకు నష్టంచేసే అమలు చేస్తున్న చట్టాలను వ్యతిరేకించాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. మండలంలోని మేటి చందాపురంఇందుర్తి గ్రామంలో రైతు కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజుకు రూ.600లు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎర్పుల యాదయ్య, రాములు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి: దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య పిలుపునిచ్చారు. మండలంలోని ఏపీలింగోటంలో సమ్మె కరపత్రాలు ఆవిష్కరించారు. కనీస వేతనం, శ్రమకు తగిన ఫలితం, సామాజిక భద్రత లేకుండా కేంద్రం తెస్తున్న కొత్త చట్టాలను నిరసిస్తూ నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యకాసం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన్న వెంకులు, సహాయ కార్యదర్శి చెర్కు పెద్దులు, దండు నాగ రాజు, మేడి యాదయ్య, వంగూరి లక్ష్మయ్య, పాలకూరి బుచ్చయ్య, సుంకరగోని వెంకటయ్య, కొత్తపల్లి రాములు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్: ఐకేపీ వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసును యూనియన్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ఏపీఎం కార్యాలయంలో అంద జేశారు. కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో వీవో ఏలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు జిల్లపల్లి మంగ, కాసర్ల సువర్ణ పాల్గొన్నారు.