Share News

తల్లీకూమార్తెల మృతిపై వీడని మిస్టరీ

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:02 AM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్‌బోర్డు కాలనీలో ఈనెల 12వ తేదీన వెలు గుచూసిన తల్లీకుమార్తెల అనుమానాస్పద మృతిపై నేటికీ సందిగ్ధత కొనసాగుతోంది.

తల్లీకూమార్తెల మృతిపై వీడని మిస్టరీ

హత్యా.. ఆత్మహత్యా తేల్చడంలో జాప్యం ఫ పదిరోజులు గడిచినా కొలిక్కిరాని కేసు

మిర్యాలగూడ అర్బన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్‌బోర్డు కాలనీలో ఈనెల 12వ తేదీన వెలు గుచూసిన తల్లీకుమార్తెల అనుమానాస్పద మృతిపై నేటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడుజిల్లా గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి మాచర్లకు చెందిన మేనకోడలు రాజేశ్వరిని 2008లో వివాహం చేసుకున్నాడు. ఆగ్రోకెమికల్స్‌ సంస్థలో జిల్లా సేల్స్‌ మేనేజర్‌ పనిచేస్తున్న సీతారాంరెడ్డి 15 ఏళ్లుగా మిర్యాలగూడలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సీతారాంరెడ్డి, రాజేశ్వరి దంపతులకు వేదశ్రీ(15), వేదసాయిశ్రీ(13) కుమార్తెలున్నారు. కంపెనీ వార్షిక బడ్జెట్‌ ఆడిట్‌ సమావేశంలో భాగంగా ఈ నెల 10న సీతారాంరెడ్డి హైదరాబాద్‌కు వెళ్లాడు. రెండురోజులు కంపెనీ పనిమీద అక్కడే ఉండి శనివారం తిరుగుప్రయాణమై సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తనభార్య రాజేశ్వరి విగతజీవిగా మారి ఉరితాడుకు వేలాడుతోంది. మరో గదిలో గొంతుపై కత్తిగాయమై రక్తపు మడుగులో చిన్న కుమార్తె వేదసాయిశ్రీ(13)మృతదేహం పడిఉంది. పెద్ద కుమార్తె వేదశ్రీ ఇంట్లోనే ఉన్నప్పటికీ ఏం జరిగిందో.. ఎలా జరిగిందో.. తేల్చి చెప్పని పరిస్థితి. అప్పటివరకు సంతోషమైన జీవనం సాగుతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదాంతంలో మునిగింది.

మృతదేహాలపై కత్తి గాయాలు

రాజేశ్వరి(34), వేదసాయిశ్రీ(13) మృతదేహాలపై కత్తి గాయాలను పోలీసులు గుర్తించారు. రాజేశ్వరి ఎడమచేతి మణికట్టు, కుడి కాలు పాదం వద్ద కత్తిగాయాలు కనిపించగా, వేదసాయిశ్రీ గొంతును పదునైన కత్తితో కోసినట్లు ఉంది. వేదసాయిశ్రీ బతికుండగానే గొంతు కోసి ఉంటే ఇంట్లోని బెడ్‌రూం నిండా రక్తం మరకలు కనిపించాలి కానీ మృతదేహం వద్ద కొంతమేరకే రక్తం పేరుక పోయి ఉండడం పలు అనుమానాలను రేకెత్తిచ్చింది. వేదసాయిశ్రీ నిద్రలోకి జారుకున్నాక ఊపిరా డకుండా చేసి హతమార్చి తర్వాత కత్తితో గొంతుకోసి ఉండవచ్చన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తల్లి రాజేశ్వరి చేతి, కాలి భాగంలో కత్తిగాయాలు ఉండగానే ఉరివేసుకొని మృతిచెందినట్లుగా భావిస్తున్నప్ప టికీ రక్తమోడుతున్న చేతితో ఉరితాడు బిగుంచుకునే సందర్భంలో మం చంపై రక్తపు మరకలు అంతగా కనిపించలేదని స్థానికులు, బంధు వులు సందేహపడ్డారు.

ఫోరెన్సిక్‌ నివేదికే ఆధారమా..?

ఈ కేసును ఛేదించేందుకు పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగాయి. డీఎస్పీ రాజశేఖర్‌రాజు పర్యవేక్షణలో క్లూస్‌టీంతోపాటు మూడు పోలీస్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు. ఒక బృందం ఏపీ రాష్ట్రంలోని రొంపిచర్ల, జమ్మలమడుగు, కుంబంపాడు, దాచేపల్లితోపాటు నల్లగొండజిల్లా నకిరేకల్‌లో పర్యటించి బంధువులను ఆరాతీసింది. మరో బృందం సంఘటన జరిగిన ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాల పరిశీలన, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌పై కూపీ లాగింది. మూడో బృందం ఇంట్లో తనిఖీ చేసి శవపరీక్షకు సిద్ధమైంది. ఈ నెల 13న మృ తదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. పోలీ సులకు ఆధారాలు లభించాయా.. లేదా..? అన్నదానిపై స్పష్టతలేదు. పో స్టుమార్టం ద్వారా సేకరించిన శ్యాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపారు.

Updated Date - Apr 24 , 2025 | 12:02 AM