దొరకని పెద్దపులి జాడ...
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:25 PM
సీసీసీ టౌన్‌షిప్‌లో పులి సంచారం కాలనీ వాసులను భయందోళనలకు గురి చేసింది. దీంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సిబ్బందితో చేరుకుని బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు గాలింపు చేప ట్టారు.
ఫసీసీసీ టౌన్‌షిప్‌లో పులి అంటూ ఇమేజ్ వైరల్...
ఫకాలనీకి చేరుకున్న అటవీ శాఖ అధికారులు...
ఫఫొటో క్రియేట్ చేసిన యువకుడు....
ఫఎలాంటి ఆధారాలు లేవు : డీఎఫ్‌ఓ శివ్ అశిష్ సింగ్...
నస్పూర్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : సీసీసీ టౌన్‌షిప్‌లో పులి సంచారం కాలనీ వాసులను భయందోళనలకు గురి చేసింది. దీంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సిబ్బందితో చేరుకుని బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు గాలింపు చేప ట్టారు. డ్రోన్ కెమెరాలతో గాలించినప్పటికీ పులి సంచరించినట్లు ఏలాం టి ఆధారాలు లభించలేదు. పెద్ద పులి జాడ దొరకపోవడంతో అందరూ ఊరిపి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి సీసీసీకి చెందిన ఓ యువ కుడు పులి తిరుగుతుందని కారులో నుంచి ఫొటో తీసినట్లుగా ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కసారి జనాల్లో ఆందోళన, రాత్రి డ్యూటీలకు వెళ్లే వారు, తిరిగి ఇళ్లకు వచ్చే సింగరేణి కార్మికులు, వివిధ పనులపై వెళ్లిన వారు ఆందోళన గు రైయ్యారు. అటవీ శాఖ అధికారులకు సీసీసీ నుంచి పలువురు ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం సీసీ సీ టౌన్‌షిప్‌కు చేరుకుంది. ఆ ఫొటో ఆధారంగా ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. రాత్రంతా అటవీ శాఖ అధికారులు చుట్టు పక్కల పెట్రో లింగ్ నిర్వహించారు. ఆర్‌కే-5 కాలనీ బ్యారెక్స్ సమీపంలోని మసీద్ వ ద్ద పులిని ఉదయం చూసినట్లు ఓ మహిళ చెప్పగా ఆ ప్రాంతాన్ని అఽ దికారులు పరిశీలించారు. కానీ పులి వచ్చి నట్లు కానీ, పాద ముద్రలు కానీ లభ్యం కాలేదు. ఎక్కడ కూడా పులి కదలికలు, ఆనవాళ్లు లభించ లేదు. గురువారం ఉదయం కూడా ఆర్‌కే-5 కాలనీ, బ్యారెక్స్, ము న్సిపల్ చెత్త డంప్ యార్డు ప్రాంతాల్లో గాలించారు. వైరల్‌గా మారిన ఇ మేజ్‌పై దృష్టి సారించి అది తయారు చేసి సోషల్ మీడి యాలో వై రల్‌కు కారణమైన యువకుడిని గుర్తించారు.
ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే ఏఐ ద్వా రా ఫొటో క్రియేట్ చేసానని ఒప్పుకున్నాడు. దీంతో అటవీ శాఖ అధి కా రులు ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్ర మాల్లో జిల్లా అటవీ శాఖ అ ధికారి శివ్ అశిష్‌సింగ్, మంచిర్యాల ఎఫ్‌ఆర్‌వో రత్నకర్, డిప్యూటి రేంజ్ అధికారి అబ్దుల్ అజార్, అట వీ శాఖ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
ఫ తప్పుడు ప్రచారం చేయొద్దు...
డీఎఫ్‌వో శివ్ అశిష్ సింగ్
పులి కనిపించిందంటూ తప్పుడు ప్రచారం చేయవద్దని, ఎక్క డైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని జిల్లా అటవీశాఖ అధి కారి శివ్ అశిష్ సింగ్ అన్నా రు. సీసీసీ టౌన్ షిప్‌లోకి పులి వ చ్చిందని జరిగిన ప్రచారంతో గురువారం ఉదయం డీఎఫ్‌వో శివ్ అశిష్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగాద డీఎఫ్‌వో మా ట్లాడుతూ బుధవారం రాత్రంతా 10 బృందాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అనుమానం ఉంటే అధికారులకు స మాచారం ఇవ్వాలని, తప్పుడు ప్రచారం చేయ్యవద్దన్నారు. ఇమే జ్‌లను సృష్టించి వైరల్ చేస్తే అవసరం ఉన్న చోటకు వెళ్లాలంటే సిబ్బంది చేరుకోవడంలో ఆలస్యం అవుతుందన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ప్రజల నమ్మవద్దని, వాటిని నిర్థారణ చేసుకో వాల న్నారు. తప్పుడు పోస్టు పెట్టి వైరల్ చేస్తే కేసుల పాలు అవుతారన్నారు.