Share News

kumaram bheem asifabad- భోజనంలో మెనూ పాటించాలి

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:17 PM

ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటింంచాలని పాటించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి అన్నారు. మండలంలోని హట్టిన ఆశ్రమ పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలన్నారు.

kumaram bheem asifabad- భోజనంలో మెనూ పాటించాలి
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేస్తున్న గిరిజన శాక సంక్షేమాధికారిణి రమాదేవి

కెరమెరి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటింంచాలని పాటించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి అన్నారు. మండలంలోని హట్టిన ఆశ్రమ పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలన్నారు. మెనూ పాటించకుంటే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలంలో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం వంట గది, స్టోర్‌ రూంలను పరిశీలిం చారు. ఆమె వెంట జీసీడీవో శకుంతల, వార్డెన్‌ పంచపుల తదితరులు ఉన్నారు.

గిరిజన ఆవాసాల అభివృద్ధి

జైనూర్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): కేంద్రం అమలు చేస్తున్న పీఎం జుగా పథకంతో గిరిజన ఆవాసాలు అభివృద్ధి చెందుతాయని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రమాదేవి అన్నారు. మండలంలోని భుసిమెట్ట గ్రామంలో గిరిజనులకు పీఎం జుగా పథకంపై శనివారం నిర్వహంచిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పీఎం జుగా పథకం జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కలెక్టర్‌, ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎస్సీఆర్పీలు మారుమూల గ్రామాల్లో ప్రతి రోజు పర్యటించి పీఎం జుగా పథం తీరు తెన్ను లు, వాటితో గల లాభాలను వివరిస్తున్నారని తెలిపారు. పీఎం జుగా పథకం జిల్లాలోని 102 గ్రామాల్లో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీఆర్పీలు ఉయిక శంకర్‌, చవ్హాన్‌ రవిందర్‌, మాజీ సర్పంచ్‌ కోట్నాక మాధవ్‌రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:17 PM