Share News

kumaram bheem asifabad- మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:10 PM

ప్రభుత్వ పాఠశాలలో విదయ అభ్యసిస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి అన్నారు. శనివారం జిల్లాలోని వాంకిడి మండలం ఖమాన గ్రామ పంచాయతీ పరిధిలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యత, నిర్వహణ, బోధనా విధానం, హాజరు పట్టికలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

kumaram bheem asifabad- మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలి
విద్యార్థుల విషయ పరిజ్ఞానం పరిశీలిస్తున్న డీఈవో దీపక్‌ తివారి

వాంకిడి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో విదయ అభ్యసిస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి అన్నారు. శనివారం జిల్లాలోని వాంకిడి మండలం ఖమాన గ్రామ పంచాయతీ పరిధిలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యత, నిర్వహణ, బోధనా విధానం, హాజరు పట్టికలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థుల ఆరోగయం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం, శుద్ధమైన తాగునీటిని అందించడం జరుగుతుందని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం, శుద్ధమైన తాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు విదాయర్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. అనతరం గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఆసిఫాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈఓ దీపక్‌ తివారి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్‌ పాఠశాలల ప్రధానోపాధాయయులు, ఆశ్రమ ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి విద్యార్థులకు విదాయబోధన, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల కల్పన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులను ఇప్పటి నుంనే వార్షిక పరీక్షలకు సన్నద్దం చేయాలని తెలిపారు. సబ్జెక్టులో వెనకబడిన విద్యార్థులను గుర్తంచి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచిచారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:10 PM