కరిగిపోతున్న జాలా గుట్ట...
ABN , Publish Date - Nov 07 , 2025 | 10:33 PM
అక్రమ క్వారీ నిర్వాహకుల దన దాహానికి ఓ కొండ కరిగిపో తోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమం గా యంత్రాల సహాయంతో క్వారీ నిర్వహిస్తూ గుట్టను తవ్వుతున్నారు. నిత్యం దాదాపు 40 నుంచి 50 ట్రాక్టర్ల ద్వారా బండరాయిని తరలించుకుపోతున్నా అడిగే వా రు కరువయ్యారు.
-అనుమతుల్లేకున్నా క్వారీ నిర్వహణ
-పెద్ద ఎత్తున తరలిపోతున్న బండ, మొరం
-జిల్లా కేంద్రంలో జోరుగా సాగుతున్న అక్రమ దందా
-చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న మైనింగ్ శాఖ
మంచిర్యాల, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): అక్రమ క్వారీ నిర్వాహకుల దన దాహానికి ఓ కొండ కరిగిపో తోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమం గా యంత్రాల సహాయంతో క్వారీ నిర్వహిస్తూ గుట్టను తవ్వుతున్నారు. నిత్యం దాదాపు 40 నుంచి 50 ట్రాక్టర్ల ద్వారా బండరాయిని తరలించుకుపోతున్నా అడిగే వా రు కరువయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అం డాళమ్మ కాలనీ సమీపంలోని, మున్సిపల్ డంప్ యా ర్డు వద్ద జాలా గుట్టలో కొంతకాలంగా అక్రమ క్వారీ కొనసాగుతోంది. పట్ట పగలే గుట్టను తొలుస్తూ బండ రాయిని తరలించుకు పోతున్నా సంబంధిత అధికారు ల దృష్టికి రాకపోవడం గమనార్హం. గుట్టలు, కొండల్లో బండరాళ్లు, మొరం తవ్వకాలపై ఎప్పటికప్పుడు నిఘా వేసి సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాల్సి న నిఘా విభాగం నిర్వీర్యం కావడంతోనే అక్రమ త వ్వకాలు యథేశ్చగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
అనుమతులు లేకున్నా తవ్వకాలు...
జాలా గుట్టలో బండ, మొరం తవ్వకాలకు సంబం ధించి గనులు, భూగర్భ శాఖ నుంచి ఎలాంటి అను మతులు లేవు. రాత్రి వేళ జేసీబీ సహాయంతో గుట్టను తొలుస్తున్న అక్రమార్కులు, పగటిపూట తవ్విన బండ, మొరాన్ని ట్రాక్టర్లలో నింపి తరలిస్తున్నారు. బండ రాళ్ల ను నేరుగా తరలిస్తుండగా, మొరాన్ని గుట్ట సమీపం లో నిల్వ చేసి, అదును చూసుకొని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అక్రమ తవ్వకాల కారణంగా గు ట్ట దాదాపు నేల మట్టం కాగా, నాలుగైదు మీటర్ల లో తుగల పెద్ద గుంతలతో ఆ ప్రాంతమంతా ప్రమా దకరంగా తయారైంది. వర్షాకాలంలో ఆ గుంతల్లో నీ రు నిలిస్తే...అటవీ ప్రాంతంలో గడ్డి కోసం వెళ్లే పశు వులు, ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాలా గుట్టలో పై భాగంలో రిజర్వు ఫారె స్టు ఉండగా, అటవీశాఖ హద్దులు ఏర్పాటు చేసింది. ఆ హద్దులను ఆనుకొని తవ్వకాలు సాగిస్తున్నారు.
భారీ సంపాదన...
జాలా గుట్టలో అక్రమ తవ్వకాల కారణంగా పెద్ద మొత్తంలో బండరాయి, మొరం తరలిపోతుండగా, ని ర్వాహకులకు భారీగా సంపాదన ఉన్నట్లు తెలుస్తోం ది. అక్రమ క్వారీలు కనుక ఎలాంటి ట్యాక్స్‌లు ప్రభు త్వానికి చెల్లించాల్సిన అవసరం నిర్వాహకులకు లేదు. నిత్యం 50 ట్రాక్టర్ల వరకు బండ తరలిస్తుండగా, ఒక్కో ట్రిప్పునకు రూ. 1500 వరకు వసూలు చేస్తున్నట్లు తె లుస్తోంది. అదే మొరం ట్రిప్పు ఒక్కంటికి రూ. 2000 వరకు ధర పలుకుతోంది. అలా వెలికి తీసిన బండ రాయి, మొరాన్ని క్వారీల నిర్వాహకులు రియల్ ఎస్టేట్ వెంచర్లు, భవన నిర్మాణాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలా నిత్యం రూ. 50 వేల నుంచి లక్ష వరకు అక్రమంగా సంపాదిస్తున్న క్వారీల నిర్వా హకులు ప్రభుత్వ ఖజానాకు మాత్రం తూట్లు పొడు స్తున్నారు. క్వారీల్లో అధిక తవ్వకాల కారణంగా భవిష్యత్తులో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగే ప్రమా దం ఉందని పలువురు పర్యావరణ ప్రేమికులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారీతిన కొండలు, గుట్టలు తరలిపోతుండటంతో పెద్ద మొత్తంలో ముప్పు వాటి ల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా అర్థరా త్రులు జేసీబీలతో తవ్వకాలు జరుపుతుండటంతో విప రీతమైన శబ్దం కారణంగా ఇబ్బందులు పడవలసి వ స్తుందని అండాళమ్మ కాలనీ వాసులు వాపోతున్నా రు. దాదాపు నెల రోజుల నుంచి గుట్టను అక్రమంగా తవ్వుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవ డంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీటి ట్యాంకు వరకు తవ్వకాలు...
మంచిర్యాల నగర ప్రజలకు రక్షిత మంచినీరు అం దించేందుకు జాలా గుట్టపై మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించారు. అందు లో నీటిని నింపి వివిధ ప్రాంతాల్లో ఉన్న రిజర్వాయ ర్లకు పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. జాలా గు ట్టలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ప్రస్తుతం ఓవ ర్ హెడ్ ట్యాంకు సమీపంలోకి వెళ్లాయి. గుట్టలో తవ్వకాల కారణంగా నీటి ట్యాంక్‌కు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలను కాలనీ వాసులు వ్యక్తం చే స్తున్నారు. తవ్వకాలు మరింత ముందుకు వెళితే ట్యాంకు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్ప టికైనా మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు స్పం దించి జాలా గుట్టలో అక్రమంగా జరుగుతున్న తవ్వ కాలను అడ్డుకోవడంతోపాటు బాఽధ్యులపై చట్టపర మైన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.