Share News

మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : జైవీర్‌రెడ్డి

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:30 AM

నూతనంగా ఏర్పాటైన మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు.

 మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : జైవీర్‌రెడ్డి
ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి

మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : జైవీర్‌రెడ్డి

తిరుమలగిరి(సాగర్‌), జూన 9 (ఆంధ్రజ్యోతి): నూతనంగా ఏర్పాటైన మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సుమారు రూ.3.33కోట్ల వ్యయంతో నిర్మించిన కేజీబీవీ పాఠశాలను సోమవారం ఆయన ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం ఏర్పాటైన క్రమంలో అరకొర వసతుల మధ్య చిన్న గదు ల్లో సుమారు 50మంది విద్యార్థులకు కేజీబీవీ ప్రారంభమైందని తెలిపారు. పలుమార్లు ఈ పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రహారీ గోడకు నిధులు ఇవ్వాలని పాఠశాల ఎస్‌వో కవిత కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ పాఠశాలకు రాజవరం మెయినరోడ్డు నుంచి వచ్చే విధంగా సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ భవనాలకు సొంత భవనాలను నిర్మించేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి మా ట్లాడుతూ కేజీబీవీకి నూతన భవనం ఏర్పాటు చేయడం హర్షనీయమని, ఇదే పాఠశాలకు జూనియర్‌ కళాశాల కూడా మంజూరు కావడంతో ఈ ప్రాంత పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి రాజవరం గ్రామంలో నిర్వహించిన చౌడమ్మ చెరువు జాతరలో పాల్గొని అక్కడి ఆలయంలో స్థానిక యాదవులతో కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్‌ చైర్మన క ర్నాటి లింగారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన కలసాని చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, ఎంపీడీవో మల్లేశ్వర్‌, ఎంఈవో శ్రీనివాస్‌, ఈఈ శైల జ, ఎస్‌వో కవిత, మాజీ ఎంపీపీ ఆంగోతు భగవాననాయక్‌, మాజీ జడ్పీటీ సీ ఆంగోతు సూర్యభాష్యనాయక్‌, డీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గడ్డం సాగర్‌రెడ్డి, నాయకులు శాగం రాఘవరెడ్డి, శాగం నాగిరెడ్డి, కృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:31 AM