Share News

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:37 PM

రామగుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్ర యాణికులను ప్రమాదాల నుంచి కాపాడడమే ప్ర ధాన లక్ష్యమని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అన్నారు. శుక్రవారం రోడ్డు సేఫ్టీ సమావేశం నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ఝా

రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా

మంచిర్యాల క్రైం, మార్చి21 (ఆంధ్రజ్యోతి): రామగుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్ర యాణికులను ప్రమాదాల నుంచి కాపాడడమే ప్ర ధాన లక్ష్యమని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అన్నారు. శుక్రవారం రోడ్డు సేఫ్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ పరిధిలోని జాతీయ ర హదారి ఎన్‌హెచ్‌ 63, ఎన్‌హెచ్‌ 363 రాష్ట్ర రహ దారుల్లో 2022 నుంచి 2024 వరకు జరిగిన ప్రమా దాల వివరాలు చనిపోయిన వారి వివరాలు ప్ర మాదాలకు గల కారణాలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు బ్లాక్‌స్పాట్‌లను గుర్తింపు తదితర అంశాలపై ట్రాఫిక్‌ పోలీసు, సంబంధిత పోలీసు అధికారులకు సూచనలిచ్చారు. అవసర మైన చోట వాహన వేగాన్ని నియంత్రించే స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డుపై జరిగే ప్రమాదాలను గుర్తించేందుకు ఇన్‌ఫర్‌మేషన్‌ వ్య వస్థను పటిష్టం చేయాలని, సీసీ కెమెరాలను ఏర్పా టు చేయాలని, నేర నియంత్రణలో ప్రధాన సీసీ కెమెరాల పాత్ర కీలకమన్నారు. స్నాచింగ్‌, రాబరి, గంజాయి, అక్రమ రవాణ, ఇతర చట్యవ్యతిరేక కా ర్యాకలాపాలను నియంత్రించవచ్చునని, డ్యూటి స మయంలో సిబ్బంది, అధికారులు స్వీయ రక్షణతో పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచి ఏసీపీ రాఘవేంద్రరావు, ట్రాఫిక్‌ ఏసీపీ నర్సింహులు, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మల్లా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:37 PM