ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:33 PM
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మిని స్ర్టేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోక్ పేర్కొ న్నారు.

మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మిని స్ర్టేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోక్ పేర్కొ న్నారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్ట ర్, అధికారులతోసమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహిం చాలన్నారు. ఈ నెల 31లోగా పూర్తి ఫీజు చెల్లించినట్లయితే 25 శాతం ఫీజు తగ్గించేందుకు అవకాశం ఉందని, దీనిపై ప్రజలకు తెలియజే యాలన్నారు. రుసుములు చెల్లించిన వారికి పట్టాల పంపిణీ ప్రక్రి య వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడు తూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో అర్హులైన వా రు రుసుము చెల్లించే విధంగా జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తా మని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్‌లు, అధికారులు పాల్గొన్నారు.