మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలి
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:28 PM
విద్యార్థులు, యువత భవిష్యత్‌పై మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని కలెక్టర్ కు మార్‌దీపక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ సమా వేశ మందిరంలో అధికారులతో సమావే శం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 24 (ఆంధ్ర జ్యోతి) : విద్యార్థులు, యువత భవిష్యత్‌పై మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని కలెక్టర్ కు మార్‌దీపక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ సమా వేశ మందిరంలో అధికారులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా క లెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగా లను నిరోధించేందుకు అన్ని శాఖల అ ధికారులు సమన్వయంతో కృషి చేయా లన్నారు. మత్తు పదార్ధాలు వినియో గించడం వల్ల కలిగే నష్టాలను అర్ధమ య్యేలా ర్యాలీలు, చిత్రలేఖనం, వ్యాస రచన, క్లబ్ ఏర్పాట్లు వివిధ రకాల పద్ధ తుల ద్వారా అవగాహన కల్పించా లన్నా రు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరిం చాలని, వారి ప్రవర్తనలో మార్పులను గమనించాలన్నారు. మం దుల దుకాణాలు, ఆసుపత్రుల్లో అందించే గుర్తించిన ప్రత్యేకమైన డ్రగ్స్‌పై రిజిష్టర్ నిర్వహించాలని, వై ద్యుల సూచన మేరకు మాత్రమే మందులు విక్ర యించాలని తెలిపారు. చట్ట విరుద్దంగా గంజాయి, మద్యం, సిగరెట్లను విక్రయించే లైసెన్స్ లేని దుకాణాలను సీజ్ చేయాలన్నారు. ఈకఆర్యక్రమం లో డీసీపీ భాస్కర్, బెల్లంప ల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏసీపీలు వెంకటేశ్వర్లు, రవికు మార్, జిల్లా అబ్కారీ, మద్యనిషేధ అధికారి నందగో పాల్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ చందన పాల్గొన్నారు.