kumaram bheem asifabad- ఆకట్టుకుంటున్న కెరమెరి ఘాట్స్
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:10 PM
కెరమెరి ఘాట్స్ అందాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఘాట్ దట్టమైన అడవీ మీదుగా మెలికలు తిరిగి ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రకృతి రమణీయ దృశ్యాలు కనువిందు చేస్తాయి. కొండల వరుసలు, రంగులు మారుతున్నట్లు కనిపించే దృశ్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. ఆసిఫా బాద్- ఉట్నూర్ - ఆదిలాబాద్ వెళ్లె ప్రయాణికులు ఈ ఘాట్ రోడ్డు నుంచి వెళ్లాల్సి ఉం టుంది.
కెరమెరి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కెరమెరి ఘాట్స్ అందాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఘాట్ దట్టమైన అడవీ మీదుగా మెలికలు తిరిగి ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రకృతి రమణీయ దృశ్యాలు కనువిందు చేస్తాయి. కొండల వరుసలు, రంగులు మారుతున్నట్లు కనిపించే దృశ్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. ఆసిఫా బాద్- ఉట్నూర్ - ఆదిలాబాద్ వెళ్లె ప్రయాణికులు ఈ ఘాట్ రోడ్డు నుంచి వెళ్లాల్సి ఉం టుంది. 18 మూలమలుపులు, వంకలు తిరిగిన రోడ్డు ఉంటుంది. ప్రయాణంఅను నిత్యం బస్సులలో, ఇతర ప్రైవేటు వాహనాలలో ప్రయాణికులు రాక పోకలు సాగిస్తారు. కెరమెరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్డు మొదలవుతుంది. సుమారు 9 కిలోమీటర్ల మేర ఎత్తైన కొండలు, సయ్యాద్రి పర్వత శ్రేణుల్లో ప్రయాణం కనువిందు చేస్తోంది. ఈ ఘాట్ రోడ్డు నైజాం రాజులు పాలించిన రోజుల్లో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు.