నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:31 PM
వినాయక నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఇందారం గోదావరి వంతెన వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గణపతి శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో రూట్‌మ్యాప్ రూపొందించామన్నారు.
జైపూర్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : వినాయక నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఇందారం గోదావరి వంతెన వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గణపతి శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో రూట్‌మ్యాప్ రూపొందించామన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన గణపతి మండళ్ల వివరాలను నమోదు చేయడం జరిగిందని, దీనికి అనుగుణంగా రూట్‌మ్యాప్‌ను ఆయా మండపాల నిర్వహకులు అనుసరించాలన్నారు.నిమజ్జన ప్రదేశాల్లో విద్యుత్, పోలీసు, మత్య్స, రెవెన్యూ సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాటుచేశామన్నారు. ప్రజల భద్రత దృష్య్టా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం,నిమజ్జనప్రదేశాల్లో క్రేన్‌లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్, తదితరులు పాల్గొన్నారు.