Share News

ఆదర్శం ఆ పాఠశాల

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:53 AM

జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో సందడిగా మారింది.

 ఆదర్శం ఆ పాఠశాల
తరగతి గదిలో పాఠాలు చదువుతున్న విద్యార్థులు

ఆదర్శం ఆ పాఠశాల

510 మంది విద్యార్థులు

ఈ ఏడాది నూతనంగా 180 అడ్మిషన్లు

కళకళలాడుతున్న నల్లగొండ పట్టణం దేవరకొండ రోడ్డులోని ప్రభుత్వ పాఠశాల

అదనపు గదులు లేక ఇబ్బందులు

నల్లగొండ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో సందడిగా మారింది. ఓ వైపు నల్లగొండ పట్టణంలో ప్రైవేట్‌ పాఠశాలలు ఎన్ని ఉన్నా ఆ పోటీని తట్టుకొని ఈ పాఠశాల అత్యధిక నూతన ప్రవేశాలతో కళకళలాడుతుంది. ఇది దేవరకొండ రోడ్డులోని ప్రభుత్వ పాఠశాల ఘనత. దీనికి ప్రధాన కారణం జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం, కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి జూనియర్‌ కళాశాల రోడ్డుపై పక్కనే ఉంది. దీంతో వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం, హాస్టల్‌ వసతి కల్పించడం, దీనికి తోడు తెలుగు, ఉర్ధూ, ఇంగ్లీష్‌ మీడియం బోధనతో పాటు డిజిటల్‌ తరగతుల నిర్వహణ ఉండటం కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి దోహదపడింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 510 మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా బడిబాట కార్యక్రమంతో మూలంగా 180మంది విద్యార్థులు ప్రవేశం పొందడం విశేషం. మొత్తం 30 మంది ఉపాధ్యాయులు నాణ్యమైన వి ద్య అందిస్తున్నారు. అదనంగా తెలుగు సబ్జ్‌క్టుకు ఒక్కరు, హిందీ సబ్జెక్టుకు 1, బయోసైన్స బోధించడానికి ఇద్దరూ టీచర్ల అవసరం ఉంది. మొత్తం 20 సెక్షన్లలో తరగతుల నిర్వహణ జరుగుతుంది.

పాఠశాలలో స్పోకెన ఇంగ్లీష్‌ సైతం

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ప్రత్యేకంగా స్పోకెన ఇంగ్లీష్‌ తరగతులను నిర్వహిస్తున్నారు. సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం గంట సేపు ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వారు ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడేందుకు తర్ఫీదు పొందుతున్నారు. దీంతో విద్యార్థులు ఎక్కువ మంది స్పోకెన ఇంగ్లీ్‌షపై మక్కువ చూపుతున్నారు. ఇంగ్లీష్‌ ఉపాధ్యాయులు ఇంగ్లీ్‌షను ధారళంగా మాట్లాడే విధంగా ఎప్పటికప్పుడూ పరీక్షిస్తూ తయారు చేస్తున్నారు.

క్రీడల్లోనూ రాణింపు....

అదేవిధంగా క్రీడల్లో రాణించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ ఇతర ఆటపోటీల్లో శిక్షణ ఇప్పించి రాష్ట్ర, జాతీ య స్థాయి పోటీల్లో రాణించే విధంగా తయారు చేస్తున్నారు. బాలబాలికలకు వేర్వేరుగా ఫిజికల్‌ ఎడ్యుకేషన టీచర్‌తో గేమ్స్‌ పిరియడ్‌లో ఆ సక్తి ఉన్న క్రీడలను ఎంపిక చేసుకొని వారికి ప్రత్యేకంగా మెళకువలు నే ర్పిస్తున్నారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులతో మెడిటేషన చేయిస్తున్నారు. పాఠశాల అభివృద్ధి అనుగుణంగా తరగతి గదుల కొరత కా రణంగా కూడా ఇబ్బందిగా ఉంది. మరో 4 నుంచి 5 తరగతి గదులను నిర్మిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుంది.

ప్రతి ఒక్కరి సహకారంతో పాఠశాల అభివృద్ధి

ప్రభుత్వ సహకారంతో పాటు ఉపాధ్యాయుల కృషి వల్ల ప్రభుత్వ పాఠశాల ఎంతగానో అభివృద్ధి చెందింది. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగిన ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదు కృషి చేసినందుకు కృతజ్ఞతలు. మొత్తం 510మంది విద్యార్థులు ఉండగా ఇందులో ఈ సంవత్సరమే 180 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో పాఠశాలను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తాం. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాం.

- ఎండీ యూసుఫుద్దీన, హెడ్‌మాస్టర్‌

Updated Date - Aug 04 , 2025 | 12:53 AM