Share News

అమర వీరుల చరిత్ర నేటితరానికి తెలియాలి

ABN , Publish Date - May 12 , 2025 | 12:34 AM

సమాజం కోసం పోరాటాలు చేసి ప్రాణాలర్పించిన వీరుల చరిత్ర నేటి తరానికి తెలియజేయాలని దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షుడు కంది సూర్య నారాయణ అన్నారు.

అమర వీరుల చరిత్ర నేటితరానికి తెలియాలి

నల్లగొండ టౌన్‌, మే 11(ఆంధ్రజ్యోతి): సమాజం కోసం పోరాటాలు చేసి ప్రాణాలర్పించిన వీరుల చరిత్ర నేటి తరానికి తెలియజేయాలని దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షుడు కంది సూర్య నారాయణ అన్నారు. జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సినిమా వాల్‌ పోస్టర్‌ను ఆదివారం ఆవి ష్కరించారు. అనంతరం టీఎన్జీవోస్‌ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సబ్బండవర్గాల ప్రజలు కలిసి ఈ సినిమా నిర్మించడం ద్వారా తెలంగాణ కళా కారులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. గౌరవ సలహాదారులు నెలపట్ల సత్యనా రాయణ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ వాళ్లకు చోటు లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నిర్మాణ కమిటీ చైర్మన్‌ నెలపట్ల రమేష్‌, చీర పంకజ్‌యాదవ్‌, కాసోజు విశ్వనాథం, దుడుకు లక్ష్మీనారాయణ, చిక్కు ల రాములు, నగర కంటి కాశయ్యగౌడ్‌, విజయ్‌, సీతారాములు, కర్ని ఆనంద్‌ కుమార్‌, వాడపల్లి సాయిబాబా, మల్లికార్జున్‌గౌడ్‌, నాగులపల్లి శ్యాంసుందర్‌, దామోదర్‌, ఆలగడప గిరిధర్‌, యేకుల రాజారావు, కృష్ణ, కొండ లలిత పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 12:34 AM