kumaram bheem asifabad- మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలి
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:46 PM
మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందరంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పద్మశాలి సేవా సంఘం, బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై కొండా లక్ష్మణ్‌బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 27 (ఆంద్రజ్యోతి): మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందరంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పద్మశాలి సేవా సంఘం, బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై కొండా లక్ష్మణ్‌బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆసిఫాబాద్ జిల్లా వాసి కావడం గర్వకారణమని తెలిపారు. తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాలలో పాల్గొని రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి సజీవన్, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, పద్మశాలి సేవా సంఘం నాయకులు ఆంజనేయులు, మల్లయ్య, తదితరులు పాల్గొన్నా రు. కాగా జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం కొండాలక్ష్మ ణ్‌బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటా నికి ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్ర మంలో ఆర్‌ఐ అంజన్న, సీఐ రాణాప్రతాప్, బుద్దే రవీందర్, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, సీసీ కిరణ్, సూపరింటెండెంట్ ఖలీముద్దీన్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి (ఆంద్రజ్యోతి): మండల కేంద్రంలో లక్ష్మణ్ సేవాసదన్, పద్మశాలి సం ఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని వేడుకలను నిర్వహిచారు. కొండా లక్ష్మన్ బాపూజీ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు అందించిన సేవలతో పాటు తెలంగాణ సాధనకోసం ఆయన చేసిన త్యాగాలను ఈ సందర్బంగా పలువురు కొనియాడారు. అనంతరం గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో లక్ష్మణ్‌సేవాసదన్ చైర్మన్ గాదే అవినాష్, వైస్ చైర్మన్ మహోల్‌కార్ అశోక్, కార్యదర్శి మడావి దౌలత్, పద్మశాలి సంఘం నాయకు లు ఒడ్డెపల్లి సతీష్, బండు, మొండయ్య, ఎంగలి రాకేష్, అశుతోష్, నరేష్, అంబెడ్కర్ సంఘం నాయకులు జైరాం, దుర్గం దుర్గాజీ, విజయ్, శ్యాంరావు, కిరణ్ పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి సందర్భంగా తహసీల్దార్ సంతోష్‌కుమార్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గిర్దావర్ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది స్రవంత, విజయలక్ష్మి, కర్రయ్య, అక్బర్‌షా, విశ్వాస్, రాజు, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యంలో శనివారం కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఆర్‌ఐ వేణు, సీనియర్ అసిస్టెంట్ అచ్యుతరావు, జీపీఓ మారుతి తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌బాపూజీచిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమం లో తహసీల్దార్ మునావర్‌షరీప్, డీటీ గణేష్, ఆర్‌ఐ నాగభూషణం పాల్గొన్నారు.