వెంటాడుతున్న వర్షాలు
ABN , Publish Date - May 22 , 2025 | 11:12 PM
మూడు రోజులుగా మండలంలో విస్తా రంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో మూడు రోజుల నుం చి ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడం రైతులకు శాపంగా మారింది. మల్కపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసిన రైతులకు వర్షాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఆందోళనలో రైతులు
కాసిపేట, మే22(ఆంధ్రజ్యోతి): మూడు రోజులుగా మండలంలో విస్తా రంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో మూడు రోజుల నుం చి ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడం రైతులకు శాపంగా మారింది. మల్కపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసిన రైతులకు వర్షాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో ఆరుగాల కష్టపడి పం డించిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తడిసిన దన్యాన్నిప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
వరిధాన్యం పందుల పాలు
జైపూర్ : ఆరుగాలం పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసు కవస్తే ఒక వైపు వర్షం మరో వైపు పందుల బెడదతో భయపడాల్సి వ స్తుంది. మండల కేంద్రంలోని సాగర్‌రావు కాంప్లెక్స్ వద్ద డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం పందుల పాలైంది. పెగడపల్లి గ్రామానికి చెందిన మామిడాల రాజేందర్‌గౌడ్ రెండు ఎకరాల వరి పంట వేయగా అందులో నీటి తడి అందక ట్రాక్టర్ లోడ్ వచ్చాయని, ఈ వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే పందులు ధాన్యాన్ని తిని అంగడి చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. కలెక్టర్ స్పం దించి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లు లకు తరలించాలని కోరుతున్నారు.
కోటపల్లి : మండలంలో అకాల వర్షం కురవడంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వర్షానికి తడిసి ముద్ద అయ్యింది. ధాన్యం అంతా తడిసి ముద్ద అవడంతో పాటు కొంత మేర కొట్టుకుపోయింది. మండల కేంద్రంతో పాటు శెట్‌పల్లి, దేవులవాడ తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలోని దేవులవాడ గ్రామంలో అత్యధికం గా 49.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభు త్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఓ వైపు ఆరబోస్తుండగానే గురువారం మధ్యాహ్నం మరోసారి తేలికపాటి వ ర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
దండేపల్లి: దండేపల్లి మండలంలోని బుధవారం కురిసిన భారీ వర్షా లకు మండంలోని కోర్విచెల్మ గ్రామంలో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతి న్నా యి. వాటిలో కొన్నింటివి ఇంటి పైకప్పులు తెచ్చిపోగా, మరికొన్నింటివి గో డలు డ్యామేజ్ అయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లను రెవెన్యూ సిబ్బంది పరిశీ లించిన తర్వాత నష్టాన్ని అంచనా వేయనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ వి జయ తెలిపారు. బుధవారం సాయంత్రం కూడా ఈదురుగాళ్లుతో వర్షం పడటంతో పెంకుటిల్లు గోడలు కూలిపోయ్యాయి.
జన్నారంలో భారీ వర్షం
జన్నారం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు అల్లాడి పోతున్నారు. బుధవారం రాత్రి తెలంగాణలోనే అత్యధికంగా జన్నారం మం డలంలోని తపాల్‌పూర్ గ్రామంలో 97.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ తెలిపింది. గురువారం సాయంత్రం వర్షం కు రవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి హెచ్చరించారు. రాత్రి పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాళా లతో పాటు బయటకు వెళ్లే ప్రజలకు సూచన చేశారు.