Share News

పల్లెల్లో హస్తం హవా...!

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:29 PM

మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు తమ సత్తా చాటారు. సింహ భా గం సర్పంచ్‌ స్థానాల్లో పాగా వేసి, హవా కొనసాగించా రు.

పల్లెల్లో హస్తం హవా...!

-సత్తా చాటిన కాంగ్రెస్‌ మద్దతు దారులు

-సింహ భాగం సర్పంచ్‌ స్థానాల్లో పాగా

-ద్వితీయ స్థానానికే పరిమితమైన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

-పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ

మంచిర్యాల, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు తమ సత్తా చాటారు. సింహ భా గం సర్పంచ్‌ స్థానాల్లో పాగా వేసి, హవా కొనసాగించా రు. తద్వారా పల్లెల్లో కాంగ్రెస్‌ పార్టీ గోడలు చెక్కు చె దరలేదనే సంకేతాన్ని ప్రతిపక్ష పార్టీలకు పంపారు. ఏ కంగా 53 స్థానాల్లో గెలుపొందడం ద్వారా కాంగ్రెస్‌ జెం డా ఎగుర వేశారు. మొదటి విడుత పంచాయతీ ఎన్ని కల్లో భాగంగా మంచిర్యాల నియోజక వర్గంలోని హా జీపూర్‌, లక్షెట్టిపేట, దండేపల్లితోపాటు ఖానాపూర్‌ ని యోజకవర్గం, మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండ లంలో ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. నాలుగు మం డలాల్లో మొత్తం 90 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి దండేపల్లి, జన్నారం మండలా ల్లో ఆరు పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో పాటు దండేపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో రి జర్వేష న్లు అనుకూలించక నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ మూడు గ్రామాలతోపాటు ఏకగ్రీవం అయి న పంచాయతీలను మినహాయించి మిగతా 81 గ్రా మాల్లో ఎన్నికలు నిర్వహించారు.

53 స్థానాలతో కాంగ్రెస్‌ అగ్రస్థానం...

జిల్లాలోని నాలుగు గ్రామాల్లోని ఎన్నికలు జరిగిన 81 స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతు తెలిపిన అభ్యర్థులు సిం హభాగం స్థానాలను కైవసం చేసుకున్నారు. ఏకగ్రీవ మైన రెండు మండలాల్లోని ఐదు స్థానాలతో కలిపి మొ త్తం 53 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ తన ఖాతాలో వే సుకుంది. మిగిలిన స్థానాల్లో బీఆర్‌ఎస్‌ 16, బీజేపీ మ ద్దతుదారులు 9 స్థానాలో గెలుపొందారు. అలాగే మరో తొమ్మిది స్థానాలను స్వతంత్రులు తమ ఖాతాల్లో వేసు కున్నారు. బీజేపీ సాధించిన తొమ్మిది స్థానాల్లో ఐదు సీ ట్లు పార్టీ పరంగా నేరుగా మద్దతు తెలిపిన అభ్యర్థు లు కాగా, మిగతా నాలుగు స్థానాలు ఆ పార్టీ పరక్షం గా మద్దతిచ్చిన అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్ని కల ప్రచారంలో కాంగ్రెస్‌ మినహా మిగతా పార్టీల్లో నుంచి ముఖ్య నాయకులు ప్రచారం చేసినప్పటికీ హస్తం పార్టీ అభ్యర్థుల దూకుడును అడ్డుకోలేకపోయారు. ఓ వైపు స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కొంత కాలంగా అనా రోగ్యంతో నియోజక వర్గానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్‌ బలపరుస్తున్న అభ్యర్థుల్లో కొంత మేర అభద్ర తాభావం నెలకొంది. ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పెద్దగా గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. మరోవైపు కేవలం ఎన్ని కల సమయంలోనే ఎమ్మెల్యే సతీమణి సురేఖ రెండు రోజుల పాటు గ్రామాల్లో పర్య టించారు. సురేఖ ప్రచారం చేయడంతో ఆ పార్టీ మద్ద తుతో బరిలోకి దిగిన అభ్యర్థుల్లో కొంత మనో ధైరం కలిగి అధిక సీట్లు సాధించడానికి కారణమైందనే టాక్‌ వినిపిస్తోంది.

ద్వితీయ స్థానానికే పరిమితమైన బీఆర్‌ఎస్‌...

తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ద్వితీ య స్థానానికి పరితమై తన ఉనికిని చాటుకుంది. ఆ పార్టీ మద్దతుతో బరిలో దిగిన వారిలో 16 మంది స ర్పంచ్‌ పీఠాలను అధిరోహించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పంచాయతీ ఎలక్షన్లలో బీఆర్‌ఎస్‌ కొంతమేర పుంజుకున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ర్యాల నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమిత మైన బీఆర్‌ఎస్‌... పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ద్వితీ య స్థానానికి చేరుకుని, పరువు కాపాడుకుంది.

బోణీ కొట్టిన బీజేపీ...

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తాను మద్దతునిచ్చిన అభ్యర్థుల గెలుపుతో సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసు కుని బోణీ కొట్టింది. మంచిర్యాల అసెంబ్లీ నియోజక వ ర్గంలో బీజేపీ మద్దతుతో పంచాయతీల్లో ప్రాతినిథ్యం వ హిస్తున్న సర్పంచ్‌లు ఇంతకాలం పాటు ఒక్కరు కూ డా లేకపోవడం గమనార్హం. తొలిసారిగా నియోజక వ ర్గంలో తొమ్మిది స్థానాల్లో తన అభ్యర్థులతో జెండా ఎ గుర వేసి తన ప్రాబల్యం చాటుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో ద్వితీయ స్థానంలో నిలిచి న బీజేపీ, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ స్థా నాలను గెలవడం ద్వారా సత్తా చాటడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీ పదవులే త ప్ప....గ్రామాల్లో ప్రజా ప్రతినిధులే లేని పార్టీ పంచా యతీ ఎన్నికల్లో నేరుగా ఐదు స్థానాల్లో తన మద్దతు దారులు విజయం సాధించగా, పరోక్షంగా మరో నలు గురు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అలాగే నాలుగు ఉప సర్పంచ్‌ స్థానాలను సైతం బీజేపీ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.

Updated Date - Dec 12 , 2025 | 11:29 PM