ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:08 PM
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత కలె క్టరేట్ భవన సమావేశ మందిరంలో అధికారులు, రైసుమిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత కలె క్టరేట్ భవన సమావేశ మందిరంలో అధికారులు, రైసుమిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2025-26కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ను సమర్ధవం తంగా నిర్వహించారు. జిల్లాలో 1,57,642 ఎకరా ల్లో వరి సాగు జరిగిందని, 2,58,970మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశామని, 2,32,743 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రాల ను లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయవద్దని, అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్‌లు, తేమ శాతం యంత్రాలు సమ కూర్చామన్నారు. కొనుగోలు వివరా లు ట్యాబ్‌లలో నమోదు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఏఈవోలు దృవీకరించిన ధా న్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధర ఉంటుందన్నా రు. జిల్లాలో 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహిం చాలన్నారు. అనంతరం హార్వెస్టర్‌పై వ్యవసాయాధికారులతో సమా వేశం నిర్వహించారు. హార్వెస్టర్ వినియోగం సమయంలో ఆర్‌పీఎం 18-20 ఉండేలా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,ఆర్డీవో శ్రీనివా సరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, మేనేజర్ శ్రీకళ, లీడ్ డిస్ర్టిక్ మేనేజర్ తిరుపతి, జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్, జిల్లా సహకార అధికారి బిక్కు, డీసీఎంఎస్ మేనేజర్ ప్రమోద్, డీఆర్‌డీవో కిషన్, డీపీఎంలు సారయ్య, స్వర్ణలత, ఏపీడీ అంజయ్య పాల్గొన్నారు.