ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - May 01 , 2025 | 11:54 PM
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సిబ్బందికి సూచించారు. మండలంలోని పలు గ్రామాలోని కొనుగోలు కేంద్రాలను డీఆర్‌డీవో కిషన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి, మే 1(ఆంధ్రజ్యోతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సిబ్బందికి సూచించారు. మండలంలోని పలు గ్రామాలోని కొనుగోలు కేంద్రాలను డీఆర్‌డీవో కిషన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ధర్మరావుపేటలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సన్నరకం వడ్లకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ 500 అదనపు బోనస్ అందిస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా చూడాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అర్హులైన నిరు పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా గూడ కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఇం దిరమ్మ ఇండ్లు నిర్మాణం పనులను చేపడుతున్నామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా బ్యాదతగా ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. అనంతరం దండేపల్లి ఎంపీడీవో కార్యలయాన్ని సం దర్శించారు. ప్రజలతో బాద్యతయుతంగా వ్యవహరించాలన్నారు. మండల పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి జాబితా రూపొందించాలన్నారు. అనంతరం కన్నెపల్లి వెంకటేశ్వర్ల రైస్ మిల్లును డీఆర్‌డీవో కిషన్, తహసిల్ధార్ సంధ్యారాణితో సందర్శిం చారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో ప్రసాద్ ఉన్నారు.