Share News

ధాన్యం సేకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:05 PM

2025-26 ఖరీప్‌ సీజన్‌ వరిధాన్యం సేకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికా రులతో సమావేశం నిర్వహించారు.

ధాన్యం సేకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

కల్టెర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : 2025-26 ఖరీప్‌ సీజన్‌ వరిధాన్యం సేకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికా రులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగో లుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వానాకాలంలో 66లక్ష ల80 వేల ఎకరాల్లో ప్రతిపాదిత వరి సాగు జరిగిందని, దాదాపు 148 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని, 80 లక్షల మె ట్రిక్‌ టన్నుల అంచనా ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. వరిధాన్యం ఏ గ్రేడ్‌ రకానికి క్వింటాలుకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధర నిర్ణయించామన్నారు. సన్నరకం వడ్లకు బోనస్‌రూ. 500 ఇస్తామన్నారు. ఈ విషయాలను రైతులకు తెలియజేయాలన్నారు. గన్నీ సంచులను, ప్యాడీ క్లీనర్లను ,తూకం యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జిల్లాపౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, జిల్లా మేనజర్‌ శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:06 PM