మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:16 PM
చ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ నియోజకవర్గంలో గురువారం విస్తృతంగా పర్యటించారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
ఉప్పునుంతల/ లింగాల/ అమ్రాబాద్/ మన్న నూరు/ వంగూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ నియోజకవర్గంలో గురువారం విస్తృతంగా పర్యటించారు. ఉప్పునుంతల, లింగాల, అమ్రా బాద్, మన్ననూరు, వంగూరు మండలాల్లో పర్య టించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఓ చోట కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వ ర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. లింగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కంటివైద్య శిబిరా న్ని గురువారం ఎమ్మెల్యే సందర్శించారు. ఇదే మండల కేంద్రంలోని అభినవ వీర మణికంఠ ఆ లయంలో అయ్యప్పస్వామి మహా పడి పూజను ఘ నంగా నిర్వహించగా, ఎమ్మెల్యే సందర్శించి పూజలు చేశారు. ఆయనను నిర్వాహకులు ఘ నంగా సన్మానించారు. అమ్రాబాద్ మండల కేం ద్రంలో జరుగుతున్న రోడ్డువిస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే పరిశీలించా రు. పనులను వెంటనే పూర్తి చేయాలని పీఆర్ ఏఈ రుక్మాంగదను ఆదేశించారు. నియోజకవ ర్గానికి రూ.2.70 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరైనందున అమ్రాబాద్ మండ లం మన్ననూరులోని గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి ఎమ్మె ల్యే వంశీకృష్ణ పరిశీలించారు. ఇక్కడ వృథాగా ఉన్న పాత పాఠశాల భవనాలను తొలగించి ఆ స్థలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవన నిర్మాణాలు చేపట్టాలని, తక్షణమే పనులను చేపట్టాలని ఇం జినీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. భవిష్యత్‌లో అమ్రా బాద్ మండలంలో గిరిజన సం క్షేమ నవోదయ, ఏకలవ్య మోడల్ పాఠశాలలను మంజూరు చేయి స్తానని అన్నారు. చారకొండ మం డల కేంద్రంలోని రైతువేదికలో తహసీల్దార్ ఉమ అధ్యక్షతన మం డలంలోని వివిధ గ్రామాలకు చెం దిన 30మంది లబ్ధిదారులకు క ల్యాణలక్ష్మి చెక్కులను జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్‌తో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ పంపిణీ చేశారు. వంగూరు మండలం నిజంబాద, తిప్పారెడ్డిపల్లి, వంగూరు లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పడించిన పంటలకు ప్రభుత్వం మద్దుతుధర కల్పించడం తో పాటు బోనస్ ఇస్తున్న ప్రభుత్వం మన ప్ర జా ప్రభుత్వమన్నారు. ఉప్పునుంతలలో నాయ కులు అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ అనంతప్ర తాప్‌రెడ్డి, బొజ్జ అమరేందర్‌రెడ్డి, ఏవో రమేష్, ఏపీఎం బాల్‌లచ్చయ్య, రైతులు ఉన్నారు. లింగా ల వైద్య శిబిరం నిర్వాహకులు రవీందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, కంటి వైద్య నిపుణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజారి వెంకటయ్య, రాయ వరం మాజీ సర్పంచ్ మల్లయ్య, మాజీ మండ ల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎండీ షఫీ, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ మక్తర్ ఉన్నారు. లింగాల అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో గురు స్వాములు గోపి నాయక్, శ్రీనివాసులు, రామ్మో హన్‌రావు, అయ్యప్ప, ఆంజనేయస్వామి మాల ధారణ స్వాములు ఉన్నారు. అమ్రాబాద్‌లో అ చ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాసమల్ల వెంకటయ్య, కాంగ్రెస్ నాయ కులు బాల్‌లింగంగౌడ్, ముకరంఖాన్, రాజగో పాల్, తిరుపతయ్య గౌడ్, అజీమ్, వెంకటేశ్వర్లు, శ్రీను పాల్గొన్నారు. మన్ననూరులో సాంఘిక సం క్షేమ శాఖ ఏఈ అప్పారావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దాసరి శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయ కులు జూలూరి సత్యనారాయణ, సంభు వెంకట్ రమణ, రహీం, రాజు, గోపాల్, బాలు, వెంకట య్య, తుల్చ్యా పాల్గొన్నారు. చారకొండలో పీఏ సీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్యగౌడ్, బ్లాక్ కాంగ్రె స్ అధ్యక్షుడు గుండె వెంకట్‌గౌడ్, మండల కాం గ్రెస్ అధ్యక్షుడు జమ్మికింది బాల్‌రాంగౌడ్, మాజీ జడ్పీటీసీ భీముడు నాయక్, మాజీ ఎంపీటీసీ గ్యార లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేందర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి నాయిని జైపాల్ పా ల్గొన్నారు. వంగూరులో పీసీబీ సభ్యుడు ఠాకూర్ బాలాజీ సింగ్, మాజి సర్పంచ్ అల్వాల్‌రెడ్డి, ఏవో ప్రియదర్శిని, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, క్యామ మల్లయ్య, సీఈతో విష్ణుమూర్తి, జనార్దన్, రమేష్‌గౌడ్ పాల్గొన్నారు.