Share News

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:34 PM

పేదల సొం తింటి కల నెరవేర్చడమే ప్ర భుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

చారకొండ, జూన్‌9 (ఆంధ్రజ్యోతి) : పేదల సొం తింటి కల నెరవేర్చడమే ప్ర భుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమ వారం మండల కేంద్రంలోని రైతువేదికలో మండలంలో ని ఆయా గ్రామాలకు చెందిన 240 మంది ఇందిరమ్మ ఇళ్ల ల బ్ధిదారులకు ప్రొసీడింగ్‌ పత్రా లను కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబ ర్‌ ఠాగూర్‌ బాలాజీసింగ్‌తో కలిసి అచ్చంపేట ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేదల కు ఒక ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని, నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అండగా నిలుస్తుందని అన్నా రు. అనంతరం మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి పనులను ఎమ్మెల్యేలు చిక్కు డు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి ప్రారం భించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌, తహసీల్దార్‌ అద్దంకి సునీత, ఎంపీడీవో ఇసాక్‌హుసేన్‌, ఎంపీవో వెంకటేష్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ జగన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుండె వెంకట్‌గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాలరాంగౌడ్‌, నాయకులు పాను గంటి అంజ య్య, జూపల్లి వెంకటయ్యయాదవ్‌, మహేందర్‌, నాయిని జైపాల్‌, గణేష్‌గౌడ్‌, గోరెటి శివ, సత్తా ర్‌, శంకర్‌గౌడ్‌, సహదేవ్‌, నర్సింహారెడ్డి, సందీప్‌ రెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీపతిరావు, ప్రశాంత్‌నా యక్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

వంగూరు : కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందని అ చ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని వంగూరు గేట్‌ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాలులో ఇందిర మ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్‌ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కార్యక్ర మంలో మార్కెట్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అల్వాల్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేష్‌గౌడ్‌, క్యామ పర శురాములు, కొండల్‌రెడ్డి, వెంకటయ్య ఉన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 11:34 PM