రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 17 , 2025 | 12:13 AM
రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ రూరల్, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని జప్తివీరప్పగూడెం గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను అమలు చేసి రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతుల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని రైతు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు అధిక దిగబడు లు సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు సాగునీటి సమర్థ వినియోగం, తక్కువ యూరియా వా డకం, విత్తనాల లభ్యత, పంట కోతల గురించి వివరించారు. విత్తనాల కొనుగోలు సమయంలో రశీదులను భద్రపరచడం, సమగ్ర పురుగు, తె గుళ్ల మందుల వినియోగం, చెట్లు నాటడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ లింగయ్య, కేవీకే శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, రాములమ్మ, జిల్లా ఉద్యానవ న అధికారి అనంతరెడ్డి, నరసింహ, హెచఎం అనంతరెడ్డి, మత్స్యశాఖ అధికారి కృష్ణనాయక్, శ్రీనివా్‌సరావు, చలపతిరావు, జిందా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అవసరం మేరకు ఎరువులు వాడాలి
హాలియా: భూసార పరీక్ష చేయించుకొని దానికి అనుగుణంగానే అవసరం మేరకు ఎరువులు వాడాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీరమ్య తెలిపా రు. హాలియా మునిసిపాలిటీ ఇబ్రహీంపేటలో శుక్రవారం నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పాలిటెక్నిక్ కంపసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రైతులకు పలు అంశాలపై అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీరమ్య మాట్లా డుతూ తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించాలని, అవస రం మేరకు రసాయనాలను వాడాలని సూచించారు. నేల తల్లి ఆరోగ్యా న్ని కాపాడవచ్చని, ఎరువులు, విత్తనాల రశీదులను భద్రపరుచుకో వాల ని సూచించారు. నాణ్యమైన విత్తనాలను వాడాలని, ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు. వేపగింజల కషాయం తయారీ వాడకం గురించి వివరించారు. కార్యక్రమంలో ఏవో సరిత, ఏఈవోలు నాగయ్య, యుగేందర్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.