Share News

బీసీలను దగా చేసిన ప్రభుత్వం

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:14 PM

42 శాతం రిజర్వే షన్‌ల పేరిట స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పిన రేవం త్‌రె డ్డి ప్రభ్వుం బీసీలను అవమానిస్తూ దగా చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

బీసీలను దగా చేసిన ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

-బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : 42 శాతం రిజర్వే షన్‌ల పేరిట స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పిన రేవం త్‌రె డ్డి ప్రభ్వుం బీసీలను అవమానిస్తూ దగా చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను మొదటి నుంచి మోసం చేస్తుందని, రిజర్వేషన్‌లపై హైకోర్టు స్టే విధించడంతో మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వ కుట్ర బట్టబయలైం దన్నారు. బీసీలను కావాలనే అవమానించారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొండంత ఆశతో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభించుకున్న బీసీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అవమానించిందన్నారు. 42 శాతం రిజర్వేషన్‌లను ప్రకటించడం ఎందుకుని ఆశల పల్లకిలో బీసీలను ఎగరినిచ్చి చట్టపరంగా అభాసుపాలైన ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వమన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో రిజర్వేషన్‌లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. రిజర్వేషన్‌లను వారే ప్రక టించి వారే కేసులు వేశారని ఇలా ద్వంద వైఖరి అవలంభించడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ ప్రకారం 42 శాతం రిజర్వేషన్‌లు బీసీలకు అ మలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో బీ జేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు, వెంకటకృష్ణ, కృష్ణమూర్తి, శ్రీధర్‌, నాగేశ్వర్‌రావు, మల్లికార్జున్‌, రాకేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 11:14 PM