Share News

బపోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:33 PM

ఇరవై, ముప్పై సంవత్సరాలుగా పోడు భూము లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ డిమాండ్‌ చేశారు.

బపోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి

- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ డిమాండ్‌

కొల్లాపూర్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఇరవై, ముప్పై సంవత్సరాలుగా పోడు భూము లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కొల్లాపూర్‌ పట్టణంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ జిల్లా పరిధిలోని కొల్లాపూర్‌ అచ్చంపే ట నియోజకవర్గాలోని మారుమూల గ్రామాలు, కృష్ణానది తీర ప్రాంతాల్లో ఎన్నోఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన, బీసీ, ఆదివారి రైతులకు ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పట్టాలిచ్చి చేతులు దులుపుకుందని పేర్కొన్నారు. 15 సంవత్సరాలకుపైగా భూమి సాగు చేసుకుంటున్న ప్రతీ ఒక్క రైతుకు ప్రభు త్వం హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు తుమ్మల శివుడు, ఎండీ యూసుఫ్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 11:33 PM