ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేయాలి
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:09 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటి పథకాల హామీలను అమలు చేయకుండా ప్రజ లను మోసం చేస్తుందని, వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర నా యకులు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. సోమవారం దండేపల్లిలో బీజేపి ఆధ్వర్యంలో దండేపల్లి బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వర కు ర్యాలీ చేపట్టి, తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు, ప్రజలతో క లిసి ధర్నా చేపట్టారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు రఘనాథ్ వెరబెల్లి
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
దండేపల్లి ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటి పథకాల హామీలను అమలు చేయకుండా ప్రజ లను మోసం చేస్తుందని, వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర నా యకులు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. సోమవారం దండేపల్లిలో బీజేపి ఆధ్వర్యంలో దండేపల్లి బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వర కు ర్యాలీ చేపట్టి, తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు, ప్రజలతో క లిసి ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి 18నెలలు గడుస్తున్న ఎన్నికల సమయంలో ప్రజలకు ఇ చ్చిన హామీలను నేరవేర్చకుండా మోసం చేస్తుందని మండిపడ్డారు. 2లక్షలపైగా ఉన్న రైతులకు పంట రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. ఆయకట్టు చివరిపంటలకు సాగునీరు అందించాలన్నారు. ఉన్నత విద్య కు దండేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డి మాండ్‌తో కూడిన వినత్రినతాన్ని దండేపల్లి తహసీల్దార్ రోహిత్‌దేశ్ పాండేకుఅందజేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్ష కార్యదర్శులు రవిగౌ డ్, సంతోష్, అనిల్, గూడెం పీఏసీఎస్ ఛైర్మన్ సురేష్, నాయకులు వెంక టరమణరావు, కృష్ణమూర్తి, రాజన్న, ప్రభాకర్, కిషన్, తులసి, హరిగో పాల్ పాల్గొన్నారు.