Share News

ఐకేపీ వీవోఏలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:22 PM

ఐకేపీ వీవోఏల చేత ప్రభుత్వంవెట్టిచాకిరీ చేయిం చుకోవడం తగదని వీవోఏల సం ఘం జిల్లా అధ్యక్షురాలు సుమలత అన్నారు.

ఐకేపీ వీవోఏలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం

- ఐకేపీ వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుమలత

కల్వకుర్తి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : ఐకేపీ వీవోఏల చేత ప్రభుత్వంవెట్టిచాకిరీ చేయిం చుకోవడం తగదని వీవోఏల సం ఘం జిల్లా అధ్యక్షురాలు సుమలత అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్‌ భవన్‌లో ఐకేపీ వీవోఏల జిల్లా సమావేశం జరి గింది. ఆమె మాట్లాడుతూ వీవోఏలకు కనీస వేతనం నెలకు రూ.26వేలు, ఇన్సూరెన్స్‌, ల్యాప్‌ టాప్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వీవోఏల సంఘం కల్వకుర్తి మం డల అఽధ్యక్షుడు దేవయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, వీవోఏల నల్గొండ జి ల్లా అధ్యక్షుడు దుర్గన్న, వనపర్తి జిల్లా అధ్యక్షు డు వెంకటయ్య, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 11:22 PM